Asianet News TeluguAsianet News Telugu

'ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్' రివ్యూ!

అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ భారత్‌లో విడుదలైంది. 

Marvel's ultimate  Avengers: Endgame movie review
Author
Hyderabad, First Published Apr 26, 2019, 4:23 PM IST

---సూర్య ప్రకాష్ జోశ్యుల

అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ భారత్‌లో విడుదలైంది. ఇప్పటివరకు ఏ హాలీవుడ్ సినిమాకు రానంత క్రేజ్ ఈ సినిమాకు రావటంతో.. మొత్తం 2,500 స్క్రీన్లలో ఈ సినిమాని రిలీజ్ చేసారు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఓ హాలీవుడ్‌ సినిమాకోసం జనాలు ఎప్పుడూ ఎదురుచూడలేదు. మరీ ముఖ్యంగా ఎవెంజర్స్ సిరీస్ లో ఇదే చివరి సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి.  ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం కథేంటి...సినిమా హైలెట్స్, మైనస్ లు ఏంటనేది రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే...

ఇన్ఫినిటీ వార్  లో తన దగ్గర ఉన్న శక్తివంతమైన ఇన్పినిటీ  స్టోన్స్ తో   భూమి మీద ఏభై శాతం జనాన్ని థానోస్‌ సర్వ నాశనం చేసేస్తాడు.ఆ వినాశనాన్ని ఆపలేకఎవెంజర్స్ తమలో కొందరని కోల్పోయి...ఆ బాధతో  ఎవరికి వారు విడిపోయి జీవితం గడుపుతూంటారు ఎవేంజర్స్. మరో ప్రక్క  తన వల్ల  నాశనం అయిపోయిన ప్రపంచంతో తనకు సంబంధం లేదని థానోస్ ఎవరికి దొరక్కుండా వేరే గ్రహానికి వెళ్లిపోతాడు. అలా ఐదేళ్లు గడిచాక... ఆ వినాశనంలో నాశనం కాకుండా జీవించిన యాంట్ మ్యాన్...మిగతా వాళ్లకు ఓ ఉపాయం చెప్తాడు.  ఇన్ఫినిటీ వార్ లో చనిపోయిన  జనంతో పాటు తమ సహచరులను తిరిగి బ్రతికించి తీసుకురావాలంటే టైం ట్రావెల్ చేయాలని అంటాడు. 

టైమ్ ట్రావెల్ లో గతంలోకి వెళ్లి థానోస్ కు దొరక్కుండా..ఆ ఇన్ఫినిటి స్టోన్స్ ను తామే చేజిక్కించుకుంటే థానోస్ చేసే వినాసనం ఆగుతుందని, అంతేకాకుండా తమ వాళ్లు, వినాశనంలో చనిపోయిన వాళ్లు క్షేమంగా ఉంటారని అంటాడు. ఈ ఐడియా నచ్చచటంతో .. అందరు కలిసి టైమ్ మిషన్ ద్వారా గతంలోకి  ప్రయాణం మొదలుపెట్టి స్టోన్స్ ని కలెక్ట్ చేస్తారు. ఈ విషయం  తెలుసుకున్న థానోస్ భూమి మీదకు వచ్చి అవెంజర్స్ తో తలపడతాడు. ఈ భయంకర యుద్ధంలో ఎవరు గెలిచారు ఎవరు ప్రాణ త్యాగం చేశారు ఎవెంజర్స్..థానోస్ ఎలా మట్టికరిచాడు అనే ప్రశ్నలకు సమాదానం స్క్రీన్ మీదే చూడాలి. 

 

ఎలా ఉంది..

వరస ఎవంజెర్స్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా లో యాక్షన్, ఫన్  కన్నా భావోద్వేగాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. టైమ్ ట్రావెల్ తో గతంలోకి వెళ్లినప్పుడు అక్కడ తమ వాళ్లను కలుసుకునేటప్పుడు , గతంలోకి వెళ్లకముందు తమ వాళ్లను తలుచుకుని బాధపడటం, చివర్లో తమ వాళ్లలో ఒకరిని కోల్పోయినప్పుడు ఎమోషన్ అవటం ఇలా చాలా భాగం ఎమోషన్స్ కే కేటాయించారు.   

అలాగని మరీ ఫన్ ని వదలేదు. అక్కడక్కడా కామెడీ నవ్విస్తూనే ఉంటుంది. వాటితో పాటు భారీ యాక్షన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ అలరిస్తాయి. సినిమా హైలెట్స్ లో థానోస్ భూమిమీదకు వచ్చాక వచ్చే సీన్స్ అదిరిపోతాయి. విజిల్ వెయ్యని  ప్రేక్షకుడు ఉండడు. అయితే సినిమా టేకాఫ్ మాత్రం బాగా స్లోగా సాగుతుంది. ఒక్కసారి కథలోకి వచ్చాక మాత్రం ఎలర్టైపోతాం. ఇన్ఫినిటీ స్టోన్స్ ని సాధించే క్రమంలో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా సినిమాలో హైలైట్‌ గా నిలుస్తాయి.

విలన్ థానోస్ పాత్ర ,  మేకప్ మరియు ఆ పాత్రకు  రానా చెప్పిన డబ్బింగ్ సూపర్బ్ గా సింక్ అయ్యింది. ఐరన్ మ్యాన్, హల్క్, థోర్ ఇలా ప్రతి ఒక్క సూపర్ హీరో వచ్చినప్పుడల్లా థియోటర్స్ లో ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. 

 

 మైనస్..

ఎవెంజర్స్ సీరిస్ ని ఎక్కువగా యాక్షన్ అభిమానులు బాగా చూస్తూంటారు. వారికి ఈ సినిమాలో యాక్షన్ తగ్గి, ఎమోషన్స్ ఎక్కువ అవటం కొంత విసుగిస్తుంది. అలాగే క్లైమాక్స్  లో విలన్ నాశనం అయ్యాక...చాలా సేపు కథ నడిపారు. అది బాగా విసిగిస్తుంది. ప్రతీ క్యారక్టర్ ముంగింపు చూపించారు. అవీ చాలా లెంగ్తీగా ఉన్నాయి. ఆ ఎపిసోడ్స్ సాధ్యమైనంత తగ్గించవచ్చు. 

 

టెక్నికల్ గా ..

దాదాపు సినిమాకు పనిచేసిన 24 క్రాప్ట్స్  తమ అత్యుత్తమ ప్రతిభను చూపాయి.  వీ.ఎఫ్.ఎక్స్,  గ్రాఫిక్స్, కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతీ విభాగం ఒకదానితో మరొకటి పోటీ పడింది. నిర్మాణ విలువల గురించి అయితే ఇక మాట్లాడుకోవాల్సిన పనిలేదు. 

 

ఫైనల్ థాట్..

ఏ సినిమాకు అయినా క్లైమాక్స్ అద్బుతం అన్నట్లు..ఈ ఎవేంజర్స్  సీరిస్ కు క్లైమాక్స్ లాంటి ఈ చివరి సినిమా అద్బుతం.

Rating: 4/5

ఎవరెవరు..

నటీనటులు : రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, జోష్ బ్రోలిన్, క్రిస్ హెమ్స్‌వర్త్, క్రిస్‌ పాట్‌, క్రిస్‌ ఇవాన్స్‌ తదితరులు. 

దర్శకత్వం : ఆంథోనీ రుస్సో, జో రుస్సో

నిర్మాత : కెవిన్ ఫీగే మరియు స్టాన్ లీ

సంగీతం : అలాన్ సిల్వెస్ట్రీ

సినిమాటోగ్రఫర్ : ట్రెంట్ ఓపాలోచ్

ఎడిటర్ : జెఫ్రీ ఫోర్డ్

Follow Us:
Download App:
  • android
  • ios