విజయ్ దేవరకొండ లిస్ట్ లో హిట్ డైరెక్టర్!

First Published 4, Sep 2018, 3:28 PM IST
maruthi to direct vijay devarakonda
Highlights

వరుస విజయాలతో సెన్సేషనల్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా ఓవర్ నైట్ స్టార్ డమ్ తీసుకొస్తే.. 'గీత గోవిందం' సినిమా వంద కోట్ల మైలు రాయిని చేరుకున్నాడు

వరుస విజయాలతో సెన్సేషనల్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా ఓవర్ నైట్ స్టార్ డమ్ తీసుకొస్తే.. 'గీత గోవిందం' సినిమా వంద కోట్ల మైలు రాయిని చేరుకున్నాడు. అతడి మార్కెట్ మూడింతలు పెరిగిపోయింది. ఇప్పుడు విజయ్ రెమ్యునరేషన్ యంగ్ హీరోలందరికంటే ఎక్కువ. దాదాపు రూ.10 కోట్లు అతడికి పారితోషికంగా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు దర్శకనిర్మాతలు.

బడా నిర్మాతలు, దర్శకులు విజయ్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే దర్శకుడు మారుతితో సినిమా చేయడానికి విజయ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో విజయ్ ఓ సినిమా చేయాల్సివుంది. ఇదే బ్యానర్ లో మారుతీ కూడా ఓ సినిమా కమిట్ అయ్యాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం మారుతి 'శైలాజారెడ్డి అల్లుడు' సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా మంచి విజయం అందుకుంటే మారుతీ-విజయ్ లా కాంబినేషన్ పై అంచనాలు మరింత పెరిగిపోతాయి. 2019 ఆరంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పలు ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. వచ్చే నెలలో విజయ్ నటించిన 'నోటా' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

loader