Asianet News TeluguAsianet News Telugu

400 థియేటర్లలో సంపూ ‘మార్టిన్ లూథర్ కింగ్’ ట్రైలర్.. ఓటు హక్కుపై బర్నింగ్ స్టార్ మెసేజ్..

బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు కాస్తా గ్యాప్ తీసుకొని ప్రస్తుతం ‘మార్టిన్ లూథర్ కింగ్’ అనే చిత్రంతో వస్తున్నారు పొలిటికల్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. 
 

Martin Luther King Trailer is now playing in 400 Screens across AP and Telangana NSK
Author
First Published Oct 19, 2023, 2:14 PM IST

బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు (Sampoornesh Babu) కామెడీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ‘హృదయ కాలేయం’ చిత్రం తర్వాత వరుసగా సినిమా చేశారు. ఆయన ఎంచుకునే కథలు, నటన ఆడియెన్స్  చేత నవ్వులు పూయించాయి. దాంతో సంపూ క్రేజ్ మరింతగా పెరిగింది. ఇక చివరిగా ‘క్యాలీఫ్లవర్’ చిత్రంతో అలరించిన సంపూ ప్రజెంట్ పొలిటికల్ సబ్జెక్ట్ తో వస్తున్నారు. సెటైరికల్ గా తెరకెక్కుతున్న  ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.

సంపూ తాజా ఫిల్మ్ ‘మార్టిన్ లూథర్ కింగ్’ (Martin Luther King). ఓటు హక్కును వినియోగించుకునే అంశంపై సంపూర్ ఓ సందేశాన్ని ఇచ్చే పాత్రలో కనిపించబోతున్నారు. ఎన్నికల వేళలో ఈ చిత్రం నుంచి వచ్చిన ట్రైలర్ చాలా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అంశాలను ట్రైలర్ లో చూపించారు. ఓటరు ఎలాంటి డిసిషన్ తీసుకోవాలనే దానిపై సస్పెన్స్ క్రియేట్ చేశారు. సంపూ ఒక్కడి ఓటుపై ఇద్దరు ప్రత్యర్థుల గెలుపు, ఓటమి ఆధారపడి ఉ:దని చూపించారు.మరీ ఆ తర్వాత ఏమైందనేది సినిమా కథ. ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సంపూ నటన ఈసారి సీరియస్ గా అలరించబోతోందని అర్థమవుతోంది. 

అయితే, మార్టిన్ లూథర్ ట్రైలర్ నిన్న విడుదలై యూట్యూబ్ లో సెన్సేషన్ గా మారింది. టాప్ 10లో ట్రెండింగ్ అవుతోంది. మంచి వ్యూస్ ను దక్కించుకుంటోంది. ఈ క్రమంలో యూనిట్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా అందింది. ట్రైలర్ ను తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ఓ 400ల థియేటర్లలో ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. ఇవ్వాళ్లి నుంచి ప్రస్తుతం విడుదలైన భారీ చిత్రాలతో ఈ ట్రైలర్ ను ప్లై చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఏదేమైనా బర్నింగ్ స్టార్ ఈ చిత్రంతో మరోసారి సెన్సేషన్ గా మారబోతున్నారని అర్థం అవుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించగా, వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో  మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఇందులో సంపూర్ణేష్ బాబుతోపాటు వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజ్ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios