Asianet News TeluguAsianet News Telugu

అలా చేసిన వాళ్ళకి సిగ్గుండాలి అంటూ రేవంత్ సీరియస్.. మెరీనాని కిడ్నాప్ చేసిన సూర్య, హౌస్ మొత్తం రచ్చ రచ్చ

బిగ్ బాస్ సీజన్ 6లో మూడవ వారం మరింతగా హీటెక్కింది. లాస్ట్ వీకెండ్ లో నాగార్జున ఇంటి సభ్యులందరికి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో అంతా బద్దకాన్ని పక్కన పెట్టి టాస్క్ లలో చురుగ్గా పాల్గొంటున్నారు.

marina kidanpped by Surya in Bigg Boss house
Author
First Published Sep 21, 2022, 11:09 PM IST

బిగ్ బాస్ సీజన్ 6లో మూడవ వారం మరింతగా హీటెక్కింది. లాస్ట్ వీకెండ్ లో నాగార్జున ఇంటి సభ్యులందరికి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో అంతా బద్దకాన్ని పక్కన పెట్టి టాస్క్ లలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఎప్పటిలాగే రేవంత్, గీతూ తమ నోటికి రెస్ట్ ఇవ్వకుండా డామినేట్ చేస్తున్నారు. 

ముఖ్యంగా గీతూ అయితే తాను చేయాలనుకున్న పని తెలివిగా చేస్తూ తన జోలికి వచ్చిన వారికి గట్టిగా కౌంటర్ ఇస్తోంది. ఇక నేటి ఎపిసోడ్ లో నిన్న బిగ్ బాస్ ఇచ్చిన అడవి దొంగలు టాస్క్ కొనసాగింది. పోలీస్ టీం, దొంగల టీం హోరా హోరీ గా తలపడ్డారు. 

గీతూ తాను దొంగిలించిన వస్తువులని సూట్కేసులో భద్రంగా దాచుకుని నిద్ర పోకుండా కాపలా కాస్తూనే ఉంది. ఇక రేవంత్ వస్తువులని ఎవరో దొంగిలించారు. దీనితో రేవంత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు ఉండాలి అంటూ ఫైర్ అయ్యాడు. 

నేను కూడా ఊరుకోను. ఇక ఎవరివి దొరికినా వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చాడు. ఇక గీతూ తన దగ్గర ఉన్న వస్తువులతో సూర్యతో బేరాలు నడిపింది. 3 ట్యాగ్ లు 500 రూపాయలు అని చెప్పింది. ఒక వేళ తనవద్ద ఉన్న వస్తువులు అమ్ముడుపోకుంటే లాస్ట్ లో తనకి నచ్చిన వాళ్ళకి ఇస్తానని తెలిపింది. 

ఇంతలో పింకీ, రేవంత్ మధ్య చిన్నపాటి గొడవ జరుగుతుంది. నీ బొమ్మలు పోయాయని చెప్పి టీం మొత్తాన్ని రిస్క్ లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని పింకీ ప్రశ్నిస్తుంది. రేవంత్ గోడ ఎక్కి పైన ఉన్న వస్తువులని తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చి వెంటనే దిగామని ఆర్డర్ వేస్తారు. 

ఇంతలో రెండవ రౌండ్ మొదలవుతుంది. రెండవ రౌండ్ రచ్చ రచ్చగా మారుతుంది. ఇనయ, కీర్తి మధ్య తీవ్రంగా వాగ్వాదం జరుగుతుంది. ఫైమా తనని కొట్టింది అంటూ నేహా కంప్లైంట్ చేస్తుంది. దొంగల గ్యాంగ్ లో సూర్య.. పోలీస్ గా ఉన్న మెరీనాని కిడ్నాప్ చేసి బంధించడంతో నేటి ఎపిసోడ్ ముగిసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios