మనసులోని కోరికను బయటపెట్టిన మిస్ వరల్డ్ మానుషి

Manushi chillar reveals her bollywood entry plans
Highlights

మనసులోని కోరికను బయటపెట్టిన మిస్ వరల్డ్ మానుషి

మిస్‌వరల్డ్ మానుషి చిల్లర్ వార్తల్లోకి వచ్చేసింది. సినిమాల్లోకి వచ్చేందుకు ఆమె సిద్ధమవుతోందంటూ కొద్దిరోజులుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవల ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను ప్రస్తావించింది. తాను ఫ్యూచర్‌‌లో ఎటువైపు వెళ్తున్నానో అనేదానిపై క్లారిటీ ఇచ్చేసింది. మిస్ వరల్డ్ అయి ఇంకా ఆరు నెలలే అవుతుందని, కాలేజీని ఇంకా పూర్తి చేయలేదని తెలిపింది.


ప్రతీరోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నానని, ఈ ఇండస్ర్టీలో ఫ్యాషన్ ఉందని, సినిమాలు చూడటమంటే ఎంతో ఇష్టమని వెల్లడించింది. కెమెరా ముందు తనను తాను కొత్తగా చూసుకున్నానని, తనకు బాలీవుడ్ నుంచి ఆఫర్ వస్తే చూస్తానని తెలిపింది. మొత్తానికి సినిమాల్లోకి రావాలన్న తన ఆలోచనను చెప్పకనే చెప్పింది.

loader