ఓంకార్‌ `మాన్షన్‌ 24` ట్రైలర్.. హర్రర్‌ సిరీస్‌లో నెక్ట్స్ లెవల్‌..

ఓంకార్‌ చాలా గ్యాప్‌ తర్వాత  ఇప్పుడు వెబ్‌ సిరీస్‌తో వస్తున్నారు. తాజాగా ఆయన `మన్షన్‌ 24` అనే వెబ్‌ సిరీస్‌ని తెరకెక్కించారు. ఈ సిరీస్‌ ట్రైలర్‌ని విడుదల చేశారు.

mansion 24 trailer out omkar new web series interesting arj

యాంకర్‌, నటుడు, దర్శకుడు, నిర్మాత ఓంకార్‌.. ఓ వైపు షోస్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. టైమ్‌ దొరికినప్పుడు సినిమాలతో దర్శకుడిగా అలరిస్తున్నారు. గతంలో ఓంకార్.. `రాజుగారి గది` సిరీస్‌ చిత్రాలను రూపొందించారు. హర్రర్‌ కామెడీగా రూపొందిన ఈ చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. అయితే చివరి చిత్రం పెద్దగా మెప్పించలేపోయింది. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్‌ తీసుకున్నారు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు వెబ్‌ సిరీస్‌తో వస్తున్నారు. తాజాగా ఆయన `మాన్షన్‌ 24` అనే వెబ్‌ సిరీస్‌ని తెరకెక్కించారు. డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ కోసం దీన్ని తెరకెక్కించారు. 

తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఓంకార్‌ బర్త్ డే సందర్బంగా ఈ ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. జాతీయ సంపదని దోచుకున్న కాళిదాసు(సత్యరాజ్‌) కోసం పోలీసులు గాలిస్తున్నారనే వాయిస్‌ ఓవర్‌తో ఈ వెబ్‌ సిరీస్‌ ప్రారంభమైంది. తాను దేశ ద్రోహి కూతురుని కాదని, నిజాయితీ పరుడైన కాళిదాసు కూతురుని అని వరలక్ష్మి శరత్‌ కుమార్‌ చెబుతుంది. తన తండ్రి కోసం కూతురు(వరలక్ష్మి శరత్‌ కుమార్‌) వెతుకుతుంటారు. పోలీసులను, ఆయన పనిచేసే ప్రభుత్వ ఆఫీస్‌లోనూ ఆరా తీస్తారు. ఈ క్రమంలో తన నాన్న పాడు బడ్డ మాన్షన్‌కి వెళ్లినట్టు ఆమె చెబుతుంది.

నాన్నని వెతికేందుకు ఫారెస్ట్ లో ఉన్న పెద్ద బంగ్లాకి వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్లినవాళ్లు తిరిగి రావడం అనేది జరగదని, ఇక మర్చిపోవడమే అని చెబుతారు. అవన్నీ రూమర్లు అని, తాను వెళ్తుంది. నువ్వు వస్తే అది రూమర్‌, రాకపోతే నువ్వే స్టోరీ అవుతావని రావు రమేష్‌ చెబుతాడు. ఇక ధైర్యం చేసి వరలక్ష్మి ఆ మాన్షన్‌లోకి వెళ్తుంది. దీంతో అందులో జరిగిన గత కథ బయటకు వస్తుంది. అందులో అవికా గోర్‌, నందు, అభినయ, రాజీవ్‌ కనకాలతోపాటు దెయ్యాల రూపంలో చిన్న పిల్లలుంటారు. ఆ మాన్షన్‌ లో ఏం జరిగిందనేది ఈ సిరీస్‌ ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ సిరీస్‌ సాగింది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఈ సారి ఓంకార్‌ గట్టిగానే కొట్టేందుకు రాబోతున్నట్టు ఈ ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తుంది. 

ఇక ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ, ట్రైలర్ బాగుందని, మంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కుదిరారని, వరలక్ష్మి  లీడ్ రోల్ చేశారు. ఆమె `నాంది`, `క్రాక్`, `వీరసింహారెడ్డి` ఇలా ప్రతి సినిమాతో వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఆమెను లేడీ ఎస్వీఆర్ పిలవొచ్చని చెప్పారు. ఓంకార్ నాకు `పటాస్` టైమ్ నుంచి పరిచయం. ఆయన ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న `మాన్షన్ 24` సిరీస్ హిట్ ఇవ్వాలి. అశ్విన్ నాకు మంచి ఫ్రెండ్. ఓంకార్ సినిమాలు కూడా కంటిన్యూ చేయమని కోరుతున్నా. అలాగే మీ బ్రదర్స్ మధ్య ఉన్న అనుబంధంతో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలని కోరుతున్నా` అని అన్నారు.  

దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ, వెబ్ సిరీస్ అంటే టీవీ ప్రోగ్రాంకు ఎక్కువ, సినిమాకు తక్కువ అనే ఇంప్రెషన్ ప్రేక్షకుల్లో ఉంది. ఆ ట్రెండ్ మారుతోంది. ఇలాంటి రైట్ టైమ్ లో నేను `మాన్షన్ 24` వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇస్తున్నా. ఈ వెబ్ సిరీస్ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించేందుకు డిస్నీ హాట్ స్టార్ తో పాటు మా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఎంతో సపోర్ట్ చేశారు. డీవోపీ మనోజ్, ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు, మ్యూజిక్ చేసిన వికాస్ ..ఇలా వీళ్లంతా ఫిల్లర్స్ లా ఉన్నారు. ఆర్టిస్టులంతా బాగా సపోర్ట్ చేశారు. వరలక్ష్మి  క్రాక్, వీరసింహారెడ్డిలో ఎంతో పవర్ ఫుల్ గా కనిపించారు. కానీ ఆమె పర్సనల్ గా సాఫ్ట్. ప్రాజెక్ట్ నచ్చితే ఎంతైనా ఇన్వాల్వ్ అయి సపోర్ట్ చేస్తారు. నాకు బలం నా తమ్ముళ్లు కల్యాణ్, అశ్విన్. వాళ్లు లేకుంటే నేను  ఈ స్టేజీ మీద ఉండేవాడిని కాదేమో. `మాన్షన్ 24`లోని ఆరు ఎపిసోడ్స్ కంటిన్యూగా చూసేంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ ఒక హుక్ పాయింట్ తో ఎండ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు` అని తెలిపారు.

నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ, `మాన్షన్ 24` సిరీస్ లో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఓంకార్.  హారర్ థ్రిల్లర్ కథకు మంచి మ్యూజిక్ చాలా అవసరం. అలాంటి సౌండింగ్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ వికాస్, అలాగే ఒక్కో ఎపిసోడ్ కు ఒక్కో టైప్ ఆర్ట్ వర్క్ చేశారు అశోక్ గారు. డీవోపీ మనోజ్ నాకు చాలా కాలంగా పరిచయం. ఈ సిరీస్ కు బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ చూపించారు. డైరెక్టర్ ఓంకార్,  డీవోపీ మనోజ్ పర్పెక్షనిస్టులు. ఫ్రేమ్ లో ఏ చిన్న తేడా ఉన్నా. .ఆ సీన్ మళ్లీ చేస్తారు. ఇవాళ ఓంకార్ గారి బర్త్ డే. ఇలాంటి మంచి ట్రైలర్ ను ఆయన బర్త్ డే రోజున రిలీజ్ చేశాం` అని చెప్పారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios