సినిమాలను పక్కనెట్టేసి మంచు ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు రాజకీయాలపై తెగ స్పందిస్తున్నారు. మోహన్ బాబు ధర్నాలకు దిగుతుంటే మంచు విష్ణు వైసిపికి మద్దతు పలుకుతున్నాడు. ఇక మనోజ్ అయితే నిత్యం ఎపి పాలిటిక్స్ పై తనదైన శైలిలో కామెంట్ చేస్తున్నాడు. 

ఇక రీసెంట్ గా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మనోజ్ తారక్ రాజకీయాల్లోకి దిగితే అంతకంటే ఏం కావాలని తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే బావుంటుందని తారక్ వస్తే నేను ఎటు వెళ్తాను తమ్ముడు.. నా మిత్రుడి రాకకోసం ఎదురుచూస్తున్నాం. తారక్ ప్రాణనానికి నా ప్రాణం అడ్డు అని వివరణ ఇచ్చాడు. 

దీంతో తారక్ ఫ్యాన్స్ మంచు మనోజ్ కామెంట్ కు ఫిదా అయిపోతున్నారు. ఆ మధ్య పవన్ కి కూడా మనోజ్ మద్దతు పలుకుతూ పలు అంశాలపై స్పందించిన సంగతి తెలిసిందే.