Asianet News TeluguAsianet News Telugu

ఫ్యామిలీ మెన్ నటుడి ఇంట తీవ్ర విషాదం, మనోజ్ బాజ్ పెయ్ కు మాతృవియోగం

బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్ బాజ్ పెయ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మనోజ్ ఎంతో ప్రేమించే ఆయన తల్లి కన్ను మూశారు. మనోజ్ తల్లి గీత మృతితో మనోజ్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. 
 

Manoj Bajpayee Mother Geeta Devi  No More
Author
First Published Dec 8, 2022, 5:04 PM IST

టాలీవుడ్ , బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మనోజ్‌ బాయ్‌పేయి ఇంట్లో విషాదం  నెలకొంది. తీవ్ర అనారోగ్యంతో 80 ఏళ్ల వయస్సులో  ఆయన తల్లి గీతాదేవి  కన్నుమూశారు. గత కొంతకాలంగా గీతా దేవి అనారోగ్యంతో బాధపడుతుండగా.. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ.. ఈరోజు  కన్ను మూశారు గీతా దేవి. ఈ విషయాన్ని అశోక్‌ పండిట్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. వయస్సు  కొంతకాలంగా గీతా దేవి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతుండగా.. ఢిల్లీలోని ప్రైవేట్ హాస్పిటల్ లో  చేర్పించి చికిత్స అందించారు. కాని చివరికి ట్రీట్మెంట్ కు ఆమె శరీరం సహకరించకపోవడంతో.. పరిస్థితి విషమించి  తుదిశ్వాస విడిచారు.

మనోజ్‌ బాజ్‌పేయి గత వారం రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. పుష్పాంజలి మెడికల్‌ సెంటర్‌ అండ్‌ మ్యాక్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో తల్లిని చేర్పించి తన తల్లికి  వైద్యం అందిస్తున్నారు. తన తల్లిని స్వయంగా దగ్గరుంచి చూసుకున్నారు మనోజ్. షూటింగ్స్ అన్నింటికి బ్రేక్ ఇఛ్చారు. ఇక  కొద్ది సంవత్సరాల కిందటే మనోజ్‌ బాజ్‌పేయి తండ్రి మృతి చెందగా.. . తాజాగా ఆయన తల్లి కూడా  మరణించడంతో కుటుంబంలో విషాదం అలుముకున్నది. 

ఇక గీతాదేవి మరణంతో పలువురు బాలీవుడ్‌ సెలబ్రెటీలు సంతాపం ప్రకటించారు. మనోజ్ కు తమ సానుబూతిని తెలియజేశారు. ఇక మనోజ్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా హ్యాపీ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఇక రీసెంట్  ఇయర్స్ లో వచ్చిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ద్వారా ఇంకా ఫేమస్ అయ్చారు మనోజు. బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు నటుడు. 

Follow Us:
Download App:
  • android
  • ios