పుష్ప పార్ట్ 2ను భారీ లెవల్లో ప్లాన్ చేస్తున్నారు టీమ్. దీని కోసం అల్లు అర్జున్ స్వయంగా రంగంలోకి దిగాడు. ఆయనే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నాడు. ఇక ఈసారి బన్నీతో పాటు ఫ్యామిలీమెన్ హీరో మనోజ్ బాజ్ పెయ్ కూడా పుష్ప 2 లో నటిస్తారని సోషల్ మీడియా కోడై కూసింది. ఈ విషయంలో స్పందించారు మనోజ్.
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చి సంచలనం సాధించింది పుష్ప సినిమా. పుష్ప సంచలన విజయంతో అల్లు అర్జున్ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాను ఆకర్షించాడు. ఈ సినిమా హిందీ వెర్షన్లో కూడా 100 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇక పుష్పకు వచ్చిన రెస్సాన్స్ తో పుష్ప2పై బాధ్యతను మరింత పెంచింది. దాంతో పుష్ప 2 సినిమా కోసం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు మేకర్స్. పుష్ప2 కోసం పక్కాగా ప్రిపేర్ అవుతున్నాడు అల్లు అర్జున్. ఈసారి అంతకు మించి ఉండేలా సినిమాను ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్టే నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ గట్టిగా చెక్కర్ల కొడుతుంది. ఇక బన్నీ కోసం ఫ్యామిలీ మెన్ స్టార్ ను రంగంలోకి దించబోతున్నారని. అందులో మనోజ్ బాజ్ పెయ్ నటిస్తున్నాడని, అది కూడా చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ అంటూ.. రూమర్స్ గట్టిగా వినిపించాయి.
ముఖ్యంగ ఈ విషయంలో డైరెక్టర్ సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ కూడా కలిసి వర్కౌట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కొంత మంది ఆర్టిస్టు లను తీసుకోవాలి అనకుంటున్నారట. ముఖ్యంగా బాలీవుడ్ ను దృష్టిలో పెట్టుకుని.. అక్కడి నుంచి ఎక్కువమంది ఆర్టిస్టులను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ప్యామిలీ మెన్ వెబ్ సిరీస్ హీరో.. బాలీవుడ్ స్టార్ మనోజ్ బాజ్ పాయ్ ను తీసుకున్నట్టుగా గుసగుసలు వినిపించాయి. ఈ పాత్రను సుకుమార్ డిజైన్ చేసిన తీరు చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. ఇక ఇంతకు ముందు కూడా అల్లు అర్జున్ - మనోజ్ బాజ్ పాయ్ కలిసి పనిచేశారు. హ్యాపీ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.
అయితే ఈ విషయంలో తాజాగా ఈ రూమర్స్‌పై స్వయంగా స్పందించారు మనోజ్ బాచ్ పెయ్డు. మీకిలాంటి వార్తలు ఎవరు చెప్తార్రా నాయనా? అంటూ ఆన్యూస్ లో ఎటువంటి నిజం లేదని తేల్చేశాడు. దీంతో మనోజ్ పుష్ప2 లో నటించడం లేదంటూ స్పష్టమైంది. ఇక మనోజ్ భాజ్‌పాయ్ విషయానికి వస్తే అతడు చివరగా సైలెన్స్.. కెన్ యు హియర్ ఇట్, డయల్ 100 సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం మనోజ్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. గుల్‌మొహర్ మూవీతో పాటు... సూప్, ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్ లతో బిజీగా గడిపేస్తున్నాడు.
