మన్మథుడు తరువాత నాగార్జున నిక్ నేమ్ గా టైటిల్ సెట్టయిన సంగతి తెలిసిందే. అంతగా జనాలకు దగ్గరైన నాగ్ అదే సీక్వల్ తో రెడీ అవుతుండడంతో సినిమాలో రొమాన్స్ తో పాటు పంచ్ లపై కూడా భారీ అంచనాలు పెరిగుంటాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసిన చిత్ర యూనిట్ ఆడియెన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేసింది. 

నాగ్ సరసన అప్పుడు సోనాలి బిద్రె నటించగా ఇప్పుడు రకుల్ సిద్ధమైంది. అస్లు మ్యాటర్ లోకి వస్తే మన్మథుడు సినిమాలో రెండు కామెడీ పాత్రలు ఇచ్చే కిక్ మాములుగా ఉండదు. ఒకటి బ్రహ్మానందం లవంగం సూరిబాబు - ఇంకోటి సునీల్ బంక్ శ్రీను క్యారెక్టర్. ఈ రెండు పాత్రల వల్ల సినిమాకు మంచి బూస్ట్ వచ్చింది. 

త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ - డైరెక్టర్ కె.విజయ్ భాస్కర్ టేకింగ్.. సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేశాయి. ఇక ఇప్పుడు యువ దర్శకుడు రాహుల్ రవిచంద్రన్ ఒక్కడే అంత బారి పాత్రలను మళ్ళీ కంటిన్యూ చేయగలడా? చేసినా ఆ లెవెల్లో మ్యానేజ్ చేయగలడా అనే అంచనాలు అందరిలో ఉన్నాయి. సునీల్ - బ్రహ్మానందం ఇప్పటికి ఆ పాత్రల్లో కొనసాగడానికి రెడీగా ఉన్నారు. మరి చిత్ర యూనిట్ ఎంటర్టైన్మెంట్ లో ఎలాంటి కిక్ ఇస్తుందో చూడాలి.