అక్కినేని నాగార్జున కెరీర్ లోనే బారి స్థాయిలో రిలీజవుతున్న చిత్రం మన్మథుడు 2. గతంలో ఎప్పుడు లేని విధంగా నాగార్జున ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఇక సినిమా మొదటి రోజు టాక్ ను బట్టి సినిమా కలెక్షన్స్ ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటె ఈ సినిమా దరిదాపుల్లో ఎలాంటి పెద్ద సినిమాలు లేవు. 

మొదట ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పై అనుమానాలు వచ్చినప్పటికీ ఆ తరువాత నాగ్ కి మంచి గిట్టుబాటయ్యింది. మొత్తంగా 20.50కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోన్న ఈ సినిమాకు మొదటి వారం కలెక్షన్స్ చాలా కీలకం కానున్నాయి. ఈ సినిమా కోసం 16కోట్ల కంటే ఎక్కువగా ఖర్చవ్వలేదని తెలుస్తోంది. ఇక నాగ్ 22కోట్ల షేర్స్ ని ఈజీగా అందుకోగలడని సినిమా హడావుడి చుస్తే అర్ధమవుతోంది. 

పైగా నెక్స్ట్ వీక్ హాలిడేస్ మూమెంట్ కూడా సినిమాకు ఎంతో కొంత కలిసొచ్చే అంశం. నైజంలో 7కోట్ల ధర పలికిన ఈ సినిమా ఆంధ్రలో కూడా అదే ధరను అందుకుంది. ఇక ఓవర్సీస్ లో 2కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించింది.