కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 ఆగష్టు 9న విడుదలకు సిద్ధం అవుతోంది. 17 ఏళ్ల క్రితం నాగార్జున నటించిన మన్మథుడు చిత్రానికి ఇది సీక్వెల్. యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని వేగవంతం చేసింది. 

తాజాగా చిత్ర యూనిట్ మన్మథుడు 2లోని తొలి పాటని విడుదల చేశారు. 'హే మానియా' అంటూ సాగే ఈ పాట ట్రెండీగా ఉంటూ ఆకట్టుకుంటోంది. నాగార్జున స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ వీడియో సాంగ్ లో నాగార్జున ఇంగ్లీషు భామలతో రొమాన్స్ అదరగొట్టేశాడు. 

రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే నాగార్జున, రకుల్ పాత్రలని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. చేతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.