టాలీవుడ్ కింగ్ నాగార్జున మన్మధుడు 2 సినిమా ఎట్టకేలకు సెన్సార్ పనులను ఫినిష్ చేసుకుంది. సినిమాలో రొమాన్స్ డోస్ ఎక్కువగా ఉందనే కామెంట్స్ రావడంతో సెన్సార్ నుంచి ఎలాంటి రిపోర్ట్ వస్తుందో? అని అంతా మాట్లాడుకున్నారు. అయితే ఆ అనుమానాలకు తావివ్వకుండా సినిమాకు U/A సర్టిఫికెట్ వచ్చే విధంగా చిత్ర యూనిట్ జాగ్రత్త పడింది. 

సెన్సార్ సభ్యుల నుంచి కూడా సినిమా బావుందంటూ కామెంట్స్ వచ్చాయి. ఇక సినిమాలో నాగార్జున చెప్పినట్లుగానే స్టార్టింగ్ టూ ఎండ్ నవ్వించే సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. కొంత మంది సినీ ప్రముఖులు కూడా అక్కినేని ఫ్యామిలీతో పాటు సినిమా ప్రివ్యూని చూశారు. సినిమా అద్భుతంగా వచ్చింది అంటూ నాగ్ నటన సరికొత్తగా ఉందని చెబుతున్నారు. 

మరి ఇంతలా పాజిటివ్ టాక్ అందుకుంటున్న ఈ సినిమా ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆగస్ట్ 9న రిలీజ్ కాబోతున్న మన్మథుడు 2 నాగ్ కెరీర్ లోనే అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు.