మలయాళ సెన్సేషనల్ మూవీ ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys) తెలుగు రిలీజ్ కు రెడీ అయ్యింది. తాజాగా తెలుగు వెర్షన్ లో ఇంట్రెస్టింగ్ ట్రైలర్ విడుదలైంది.

మలయాళంలో సంచలన విజయం సాధించిన చిత్రం `మంజుమ్మల్‌ బాయ్స్`. సస్పెన్స్ థ్రిల్లర్ గా తక్కువ బడ్జెట్‌తో రూపొంది మలయాళ చిత్రాల రికార్డులను బ్రేక్‌ చేసింది. మాలీవుడ్‌లోనే హైయ్యెస్ట్ కలెక్షన్లు సాధించి సెన్సేషన్ గా మారింది. దాదాపు రూ.200 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని నివేదికలు తెలుపుతున్నాయి. ఇలాంటి చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకూ రాబోతోంది. 

ఈ మూవీని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్ కలిసి డబ్ చేస్తుండటం విశేషం. మలయాళంలో సంచలనంగా నిలిచిన ఈ చిత్రం తెలుగులో ఏమేరకు ఆదరణ పొందుతుందో చూడాలి. ప్రస్తుతం యూనిట్ మాత్రం ఇక్కడ జోరుగానే ప్రమోషన్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 6న తెలుగులో విడుదల కాబోతుండటంతో సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను అందిస్తున్నారు. 

తాజాగా ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు వెర్షన్ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉ:ది. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో మంజుమ్మల్ బాయ్స్ అనేది ఒక టీమ్. వీరు తమిళనాడులోని కొడైకెనాల్ లో గల గుణ గుహలకి విహారయాత్రకి వెళ్తారు. అక్కడ ఓ వ్యక్తి డెవిల్స్ కిచెన్‌ అనే గుంతలో పడిపోతాడు. దీంతో మిగిలిన యువకులు తమ స్నేహితుడిని ఎలా కాపాడుకున్నారనేది కథ. ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్‌గా ట్రైలర్ సాగింది. మలయాళంలో సంచలనంగా మారిన ఈ చిత్రం తెలుగులో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. 

YouTube video player