సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి, కృష్ణ గారి కూతురు మంజుల గతంలో హిరోయిన్ అవ్వాలని ట్రై చేసింది. బాలకృష్ణ సినిమాలో హిరోయిన్ గా షూటింగ్ కూడా  చేసింది. కానీ అప్పట్లో సూపర్ స్టార్ గా వెలుగొందిన కృష్ణ అభిమానులు అఢ్డు  చెప్పటంతో... మంజుల డ్రాప్ అయిపోయింది.

 

ప్రస్థుతం సినీ నిర్మాణంలో వున్న మంజుల కాసేపటి క్రితం సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ అటెన్షన్ క్రియేట్ చేస్తోంది. తన కూతురు జాన్వి కెమెరా ముందుకు రావటం సంతోషమని, ఫస్ట్ టైమ్ అయినా.. తన దైన స్టైల్ చూపించిందని చెప్తూ మురిసిపోయింది.

 

ఇంతకీ మేటరేంటంటే మంజుల కూతురు జాన్వి, సందీప్ కిషన్ లవ్ ఇంట్రెస్ట్ గా ఓ చిన్న రోల్ చేసింది. దీంతో మంజుల మురిసిపోతోంది. తన కూతురు నేచురల్ స్టార్ అని చెప్తోంది. మంజుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిన్న సీక్వెన్స్ లో జాన్వి కనిపించనుందట. తనను చూస్తుంటే... చిన్నప్పుడు మహేష్ గుర్తొస్తున్నాడంటోంది మంజుల.