మణిశర్మ అంటే ఒకప్పుడు మెలోడీ స్టార్ హీరోలకు దర్శకులకు ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలి. మినిమమ్ గ్యారెంటీ మెలోడీస్ ఉంటాయని తనకంటూ ఒక మార్క్ బ్రాండ్ ను సెట్ చేసుకున్నాడు. ఇక ఆయన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే స్టార్ హీరోలతో మణిశర్మ సినిమాలు చేయడం లేదు. 

ఇక చాలా రోజుల తరువాత ఆయన పూరి జగన్నాథ్ తో కలవబోతున్నారు. వీరి కలయికలో వచ్చిన పోకిరి ఎంతగా హిట్టయ్యిందో స్పెషల్ చెప్పనవసరం లేదు. ఆ తరువాత ఈ కాంబో లో వచ్చిన చిరుత - ఏక్ నిరంజన్ - కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాలు మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. ఇక చాలా కాలం తరువాత అపజయాలతో సతమతమవుతున్న పూరి మణిశర్మను ఎంచుకున్నాడు. 

రామ్ తో చేయనున్న ఇష్మార్ట్ శంకర్ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించనున్నట్లు తెలుస్తోంది. పూరి సొంత బ్యానర్ లో సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ టీమ్ మొత్తం దాదాపు హిట్స్ 'కోసం ఎదురుచూస్తున్న వారే కావడంతో తప్పకుండా కంటెంట్, ఉన్న సినిమాతోనే రానున్నట్లు టాక్ వస్తోంది.