ప్రస్తుత రోజుల్లో చాలా వరకు మ్యూజిక్ వింటుంటే ఎక్కడో విన్నట్లు ఉండే అనే భావన కలుగకుండా ఉండదు. సంగీత దర్శకులు ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తారో ఎవరికీ అర్ధం కాదు అనే సందేహం చాలా మంది సినీ ప్రేమికులకు మిస్టరీగా మారింది. చాలా వరకు కాపీ కొట్టడమే అనే మచ్చను తెచ్చుకుంటారు సంగీతదర్శకులు. 

కాపీ కొట్టినట్లు ఒప్పుకునే వారు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువమంది ఉంటారు. ఇకపోతే రీసెంట్ గా మణిశర్మ ఎవరు ఊహించని విధంగా కాపీ కొట్టినట్లు చెప్పేశారు. కొన్ని సందర్భాల్లో కాపీ కొట్టిన మాట వాస్తవమే అని చెబుతూ.. సాధారణంగా సంగీత దర్శకులు వారి సొంతంగా మ్యూజిక్ ఇవ్వడానికి ఇష్టపడతారని అన్నారు. 

ఇక అప్పుడప్పుడు దర్శక నిర్మాతల బలవంతం మేరకు ఇతర బాణీలను కాపీ కొట్టాల్సి వస్తుందని ఓపెన్ గా వివరణ ఇచ్చారు. దీంతో మెలోడీ బ్రహ్మ ఇచ్చిన ఆన్సర్ తో నెటిజన్న్ డిఫరెంట్ గా కామెంట్ చేస్తున్నారు. ఈ విధంగా నిజాయితీగా చెప్పుకునే వారు ఇండస్ట్రీలో చాలా తక్కువమంది ఉంటారని అనుకుంటున్నారు.