అలనాటి అందాల తార మనీషా కోయిరాలా ఇప్పుడు యాక్టివ్ అవుతుంది. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఈ భామ తన పెళ్లి లైఫ్ గురించి ఓపెన్ అయ్యింది.
`నెల్లూరి నెరజాణ` అంటూ తెలుగు ఆడియెన్సే కాదు, సౌత్‌ని ఊపేసింది మనీషా కోయిరాలా. 1990నాటి కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్. ఒకప్పుడు అందాల తారగా పాపులర్ అయిన మనీషా కోయిరాలా జీవితంలో అనేక స్ట్రగుల్స్ ఉన్నాయి. ఓ వైపు వైవాహిక జీవితం నిలబడలేకపోవడం, మరోవైపు క్యాన్సర్ బారిన పడటంతో ఈ బ్యూటీకి దెబ్బ మీ దెబ్బ పడినట్టు అయ్యింది. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొని తిరిగి నిలబడింది. మళ్లీ నటిగా బిజీ అయ్యింది. హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తుంది.
తాజాగా తన వైవివాహిక జీవితానికి సంబంధించి మనీషా కోయిరాలా స్పందించింది. నేపాల్‌కి చెందిన మనీషా కోయిరాలా ఆ దేశానికి చెందిన వ్యాపార వేత్త సమ్రాట్ దహల్‌ని వివాహం చేసుకుంది. 2010లో వివాహం జరగ్గా ఆరు నెలలకే విభేదాలు ప్రారంభమయ్యాయట. గొడవల నేపథ్యంలో దాదాపు ఏడాది పాటు పోరాడి ఆమె విడాకులు తీసుకుంది. 2012లో తన భర్త సమ్రాట్ దహల్‌తో విడిపోయింది మనీషా.
అయితే తాజాగా ఆమె తన వైవాహిక జీవితంపై ఓపెన్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. పెళ్లైన ఆరు నెలలకే ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని, ఎంత ట్రై చేసినా ప్రయోజనం లేదని, తాను ప్రేమించిన భర్తే తనకు శత్రువుగా మారాడని, దీంతో విడాకులు తీసుకున్నట్టు చెప్పింది. అయితే విడిపోవడానికి తానే కారణమని, అందులో తన భర్త తప్పేమి లేదని ఆమె గతంలో చెప్పింది. విడుదలకు ఆలోచన కూడా తనదే అని, పెళ్లి చేసుకుని తాన తప్పు చేశానని వెల్లడించింది.
ఇంకా చెబుతూ, `పెళ్లి తర్వాత ఎన్నో కలలు కన్నా. అది ఎప్పటికీ నెరవేరలేదు. అవి కలలుగానే మిగిలిపోయాయి. ఇలాంటి సమస్య ఎవరికీ రాకూడదు. నేను మాత్రమే కాదు, వైవాహిక బంధంలో సంతోషంగా లేకుండా విడిపోవడమే ఏకైక ఎంపిక` అని తెలిపింది. ఇదిలా ఉంటే ఇటీవల రజనీకాంత్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో కలిసి నటించిన `బాబా` సినిమా పరాజయంతో సౌత్‌లో తన పనిఅయిపోయిందని ఆ తర్వాత ఆఫర్లు రాలేదని చెప్పి షాకిచ్చింది. ఇక తెలుగులో `క్రిమినల్` చిత్రంలో నటించింది మనీషా కోయిరాలా. కానీ తమిళంలో నాలుగైదు సినిమాల్లో నటించింది.
మనీషా కొయిరాలాను అలనాటి నటి నర్గీస్‌తో పోలుస్తారు. సౌత్‌లో `బాంబే’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె 1991లో `సౌదాగర్` సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత `బాంబే` సినిమాతో జనాల హృదయాల్లో భిన్నమైన ముద్ర వేసింది. వీటితోపాటు `1942: ఎ లవ్ స్టోరీ`, `అగ్ని సాక్షి`, `గుప్తా`, `మన్` వంటి చిత్రాలలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానాన్ని ఏర్పర్చుకుంది. ఇటీవల కాలంలో మనీషా హిందీలో `డియర్ మాయా`, `లస్ట్ స్టోరీస్`, `సంజు`, `ప్రస్థానం`, `మాస్కా`, `షేహజాడా` వంటి చిత్రాల్లో నటించింది.
