ఆ హీరోలు ఇప్పటికీ రొమాన్స్ చేస్తూనే ఉన్నారు!

First Published 29, Jun 2018, 4:21 PM IST
manisha koirala comments on star heroes
Highlights

ఒకప్పుడు మనీషా కొయిరాలా అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. 90లలో దాదాపు అగ్రహీరోలందరి సరసన 

ఒకప్పుడు మనీషా కొయిరాలా అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. 90లలో దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించి తన సత్తా చాటింది. కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మనీషా ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో డియర్ మాయ, లస్ట్ స్టోరీస్ లలో నటించింది. తాజాగా 'సంజు' సినిమాలో కూడా కనిపించింది. ప్రస్తుతం ఆమె లిస్టులో పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి.

అయితే ఆమె ఒకప్పుడు కలిసి నటించిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి హీరోలు ఇప్పటికీ హీరోలుగా కొనసాగుతున్నారని, తనకు మాత్రం తల్లి పాత్రలు వస్తున్నాయంటూ కామెంట్ చేసింది మనీషా. చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ నుండి తప్పుకొని తిరిగి మళ్లీ వచ్చారు. మేం నటించిన సినిమాలలో హీరోలు ఆపకుండా హీరోలుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు.. వారు ఇప్పటికీ ఇరవై ఏళ్ల వయసున్న అమ్మాయిలతో రొమాన్స్ చేస్తూనే ఉన్నారు.

కానీ మాకు మాత్రం 40 దాటగానే తల్లి పాత్రలకు పరిమితం చేస్తున్నారు.. ఇది నాకు అసలు అర్ధం కాని విషయం అంటూ తన కోపాన్ని ప్రదర్శించింది మనీషా కొయిరాలా. అలానే ఇప్పటి జెనరేషన్ గురించి మాట్లాడుతూ.. 'నా ముఖం మీద మడతల గురించి మాత్రం ఎవరు ఆరా తీయలేదు. ఈ వయసులో ఇది కామన్ అని అర్ధం చేసుకున్నారు. అది మంచి విషయం' అని స్పష్టం చేశారు. 
 

loader