దక్షిణాది అగ్ర దర్శకుల్లో టాప్ డైరెక్టర్ అయిన మణిరత్నం సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల కోసం సినీ ప్రేమికులు ఎదురుచూస్తుంటారు. గతేడాదిలో ఆయన డైరెక్ట్ చేసిన 'నవాబ్' సినిమా విడుదలై మంచి సక్సెస్ అయింది.

ఇప్పుడు మరో భారీ మల్టీస్టారర్ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మణిరత్నంకి రజినీకాంత్ కూతురు రూపంలో పెద్ద షాక్ తగిలింది. మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' అనే హిస్టారికల్ నవల ఆధారంగా సినిమా తీయలనుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

కానీ ఇంతలో రజినీకాంత్ చిన్న కూతురు సౌందర్య ఇదే నవల ఆధారంగా వెబ్ సిరీస్ రూపొందిస్తున్నట్లు ప్రకటించేసింది. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ కంపనీతో కలిసి ఆమె ఈ వెబ్ సిరీస్ ని నిర్మించబోతుంది. సూర్య ప్రతాప్ ఎస్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు.

మణిరత్నం కంటే ముందే సౌందర్య రజినీకాంత్ అనౌన్స్మెంట్ ఇవ్వడంతో మరి మణిరత్నం ఏం చేస్తాడా..? అనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మణిరత్నం తన సినిమాకు సంబంధించిన కాస్టింగ్ ఇతర పనుల్లో నిమగ్నమై ఉన్నారు. మరి ఈ విషయంపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి!