ఒకప్పుడు తనదైన శైలిలో సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్స్ ను అందుకున్న దర్శకుడు మణిరత్నం. సౌత్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి మోస్ట్ టాప్ డైరెక్టర్ గా వెలుగొందిన ఆయన ఇప్పుడు కాస్త తడబడుతున్నారు. రీసెంట్ గా  సివంద వానం చిత్రం ద్వారా అరవిందస్వామి, శింబు అలాగే విజయ్‌సేతుపతి, అరుణ్‌ విజయ్ వంటి వారితో మల్టీస్టారర్ చేసి సక్సెస్ అందుకున్నాడు. 

ఇక నెక్స్ట్ మరో మల్టీస్టారర్ కు ప్రిపేర్ అవుతున్నాడు ఈ క్లాసిక్ దర్శకుడు. అందులో విజయ్ తో పాటు చియాన్ విక్రమ్ - శింబు నటించబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వస్తే.. ఈ కథను గతంలోనే టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకు మణిరత్నం వివరించారు. పొన్నియన్‌ సెల్వమ్‌ అనే ఆ కథను విజయ్ - మహేష్ కు సెట్ చేసుకున్న మణిరత్నం మహేష్ నో చెప్పడంతో ఇప్పుడు కథలో మార్పులు చేసి కోలీవుడ్ హీరోల నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు.

విక్రమ్ సినిమాలో సరికొత్తగా కనిపించనున్నాడని సమాచారం. గత కొంత కాలంగా  విక్రమ్ కి విజయాలు లేవు. ఇక ఇప్పుడు విజయ్ - శింబు తో స్క్రీన్ షేర్ చేసుకొని సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక సినిమా చారిత్రాత్మక అంశంతో తెరకెక్కబోతున్నట్లు టాక్. కుదిరితే 2019 స్టార్టింగ్ లో సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.