దాదాపు రెండేళ్ల తరువాత నటి కంగనా రనౌత్ 'మణికర్ణిక' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు కొన్ని చోట్ల ప్రదర్శితం కావడంతో సినిమా టాక్ బయటకి వచ్చింది. ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రలో కంగనా  జీవించేసిందని అంటున్నారు. తన పవర్ ఫుల్ యాక్షన్ తో కథకు ప్రాణం పోసిందని, సినిమా మొత్తం తన భుజాలపై నడిపించిందని అంటున్నారు.

కంగనా అభిమానులు సినిమా చూసి తెగ మురిసిపోతున్నారు. గత చిత్రాలతో పోలిస్తే కంగనా రనౌత్ ఈ సినిమాలో అధ్బుతంగా నటించిందని, ఈ సినిమాతో మరో నేషనల్ అవార్డు అందుకోవడం ఖాయమని అంటున్నారు.

ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సినిమా సెకండ్ హాఫ్ మరింత అధ్బుతంగా ఉందని, సినిమా క్లైమాక్స్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అంకిత లోఖండే, అతుల్ కులకర్ణి, మిష్టి, జిస్షు సేన్ గుప్తా వంటి తారలు ముఖ్య పాత్రల్లో నటించారు.