స్టార్ హీరోలకు దర్శకులకు మంచి రిలేషన్ ఉంటే సినిమాలపై అంచనాలు ఏ రేంజ్ లో పెరుగుతాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో మహేష్ - పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో త్రివిక్రమ్ కి మంచి అనుబంధం ఉంది. ఈ విషయం గురించి అందరికి తెలిసిందే. అయితే త్రివిక్రమ్ ఎవరితో స్నేహం చేసిన వారిని మర్చిపోడన్నది కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నవారు కూడా చెబుతుంటారు. 

రీసెంట్ గా అరవింద సమేత  సినిమాలో తిను అనే డైలాగ్ తో ఫెమస్ అయిన మాణిక్ రెడ్డితో కూడా త్రివిక్రమ్ కు మంచి అనుబంధం ఉంది. కెరీర్ మొదటి నుంచి వీరికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇకపోతే రీసెంట్ గా మాణిక్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. 

ఆయన మాట్లాడుతూ.. త్రివిక్రమ్ సినిమా ఫీల్డ్ లోకి రాకముందు ఎలా ఉన్నడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. అందరితో ఆప్యాయంగా మాట్లాడే గుణమున్న వ్యక్తి. తన ప్రతి సినిమాలో సన్నివేశాలు చాలా న్యాచురల్ గా ఉండలని త్రివిక్రమ్ అనుకుంటాడు. 

అలాంటి ఆలోచనతో మహేష్ ను అతడు సినిమా కోసం రిస్క్ లో పెట్టేశాడు. అతడు సినిమాలో ఫస్ట్ లో వచ్చే మర్డర్ సీన్ న్యాచురల్ గా ఉండాలని పాత బస్తీలో చేశారు. అక్కడ కెమెరాలు ఎవరికీ కనిపించకుండా షూటింగ్ నిర్వహించారు. అప్పుడు చిత్ర యూనిట్ మొత్తం చాలా బయపడింది. 

మహేష్ ను రిస్క్ లో పెడుతున్నారా? అంతా ఆందోళన చెందారు. కానీ షూటింగ్ ప్లాన్ సక్సెస్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారని మాణిక్ రెడ్డి ఆ నాటి జ్ఞాపకాన్ని గుర్తు తెలియజేశారు.