మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ తెలుగు టైటిల్ ఫిక్స్
‘పొన్నియన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ టాకీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మణిరత్నం దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్ఠాత్మక భారీ బడ్జెట్ చిత్రం పొన్నియన్ సెల్వన్. 1995లో కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవలా ఆధారంగా ఈ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కిస్తున్నారు. అదే నవల పేరుతో మణిరత్నం మ్యాజిక్ చేయబోతోన్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం కోలీవుడ్ మొత్తం కదిలింది. ఈచిత్రాన్ని మణిరత్నం, లైకా ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, విక్రమ్ ప్రభు, త్రిష, మోహన్ బాబు, ఐశ్వర్యా రాయ్ వంటి వారు నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ సైతం రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తెలుగు వెర్షన్ టైటిల్ ఏమినటనేది హాట్ టాపిక్ గా మారింది.
అందుతున్న సమాచారం ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు వీరుడు అనే టైటిల్ ని ఫిక్స్ చేసారని తెలుస్తోంది. ఈ మూవీ మొదటి పార్ట్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయబోతోన్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న యూనిట్.. కరోనా వల్ల కాస్త వెనక్కి తగ్గింది. 2019 డిసెంబర్‌లో థాయ్‌ల్యాండ్‌లో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనా షూటింగ్ వాయిదా పడింది. ఈ ఏడాది జనవరి నుంచి సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోనూ జరుపుకొంది.
జైపుర్, జోధ్పూర్, మధ్యప్రదేశ్‌కి చెందిన రాజభవనాలకు బదులుగా హైదరాబాద్‌లోని సెట్లోనే షూటింగ్ చేసారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్, విక్రమ్, త్రిష, జయం రవి, కార్తీ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా జయరామ్, శోభిత ధూళిపాళ్ల, శరత్ కుమార్, ప్రకాష్‌రాజ్, ప్రభు, ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటిస్తున్నారు. చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.