మ్యూజిక్, టేకింగ్, కథ, కథనం, క్లైమాక్స్ ఇలా ప్రతి విషయాన్ని ఆడియన్స్ చాలా బాగా చెప్తున్నారు. మ్యూజిక్ అయితే మైండ్‌లో నుంచి పోవడం లేదంటున్నారు. కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంది.
అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' సినిమా, యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అప్పటివరకూ వచ్చిన రెగ్యులర్ కంటెంట్ కి భిన్నంగా ఈ సినిమా ఉండటంతో, యూత్ కి కొత్తగా అనిపించింది. అలాగే ఈ సినిమాలోని రొమాంటిక్ సీన్స్ ను .. సాంగ్స్ ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. పాయల్ గ్లామర్ ను చూసి కుర్రాళ్లు మనసులను పారేసుకున్నారు. ఈ సినిమాను తెరకెక్కించిన అజయ్ భూపతి, ఆ తరువాత 'మహాసముద్రం' చేయగా, ఆది వర్కవుట్ కాలేదు. పాయల్ ఆ తర్వాత చేసిన ఏ సినిమా ఆడలేదు.
మరో ప్రక్క మహాసముద్రం సినిమా ఎఫెక్ట్ తో అజయ్ భూపతి దర్శకత్వంలో నటించేందుకు చాలా మంది ఆసక్తి చూపించలేదు. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆయన, హీరోయిన్ ఓరియెంటెడ్ కథను రెడీ చేసుకున్నాడు. ఈ కథకి 'మంగళవారం' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు. హారర్ జోనర్లో .. విలేజ్ నేపథ్యంలో ఈ కథ నడిపారు. మొన్న శుక్రవారం రిలీజైన ఈ సినిమాతో ఈ ఇద్దరికీ హిట్ పడింది. మ్యూజిక్, టేకింగ్, కథ, కథనం, క్లైమాక్స్ ఇలా ప్రతి విషయాన్ని ఆడియన్స్ చాలా బాగా చెప్తున్నారు. మ్యూజిక్ అయితే మైండ్‌లో నుంచి పోవడం లేదంటున్నారు. కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంది.
ఈ క్రమంలో అజయ్ భూపతి తన తదుపరి సినిమాని ఏ హీరోతో చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం మేరకు ‘ఆర్.ఎక్స్ 100’లో హీరోగా చేసిన కార్తికేయతో అజయ్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ కథా రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో నడుస్తుందని అంటున్నారు. అక్కడ జరిగే ప్యాక్షన్ నేపధ్యంలో ఓ యాక్షన్ డ్రామాని సెట్ చేశాడని అంటున్నారు. ఈ కథ చాలా ఇంటెన్స్‌తో ఉంటుందని అంటున్నారు. మరో ప్రక్క కార్తికేయ కూడా ఫామ్ లో లేడు. మంగళవారం సినిమా సక్సెస్ కు కంగ్రాట్స్ చెప్పటానికి వచ్చి ఇద్దరూ కలిసారని ఈ సందర్బంగా కలిసి ఓ ప్రాజెక్టు చేయడానికి రెడీ అయ్యారని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ విషయాలు త్వరలోనే అఫీషియల్ గా బయటకు వస్తాయి.
