కర్ణాటక రాజకీయాలతో విష్ణుకి లింక్!

First Published 17, May 2018, 5:06 PM IST
manchu vishnu tweet on karnataka election results
Highlights

హీరో మంచు విష్ణుకి కర్ణాటక రాజకీయాలతో లింక్ ఏంటి.. అనుకుంటున్నారా..? 

హీరో మంచు విష్ణుకి కర్ణాటక రాజకీయాలతో లింక్ ఏంటి.. అనుకుంటున్నారా..? లింక్ అయితే ఉందికానీ అది వ్యక్తిగతంగా కాదండీ సినిమాల వరకు మాత్రమే పరిమితం. అసలు విషయంలోకి వస్తే.. రీసెంట్ గా జరిగిన కర్ణాటక ఎన్నికలు రెండు రోజులు పాటు ఉత్కంఠతో సాగి చివరకు భాజపాకే అధికారం అందించారు. నేడు కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. 

అయితే కన్నడనాట ఎన్నికలు, ఫలితాలపై హీరో మంచు విష్ణు తనదైన శైలిలో స్పందించారు. ఎన్నికల తీర్పుని తను నటిస్తోన్న 'ఓటర్' సినిమాతో పోల్చి వార్తల్లో నిలిచారు. 'వాట్ ఏ ట్విస్ట్ సర్ జీ.. కర్ణాటక తీర్పు ఇంచుమించుగా నేను నటిస్తోన్న 'ఓటర్' సినిమాలానే ఉంది' అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

దర్శకుడు జీఎస్ కార్తిక్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను రాజకీయ నేపధ్యంతో తెరకెక్కించారు. ఓట్ల కోసం తప్పుడు హామీలు చేసే నాయకులపై ఓటర్లంతా తిరగబడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తోఈ సినిమా రూపొందింది. నిజానికి ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సింది కానీ కొన్ని సాంకేతిక కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది.  

 

loader