Asianet News TeluguAsianet News Telugu

సోషల్‌ మీడియా, యూట్యూబర్స్ కి మంచు విష్ణు వార్నింగ్‌.. 48 గంటల్లో ఆ పనిచేయకపోతే బ్యాన్‌ చేస్తామంటూ హెచ్చరిక..

`మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌`(మా) అధ్యక్షుడు మంచు విష్ణు .. సోషల్‌ మీడియా, యూట్యూబర్స్ పై ఫైర్‌ అయ్యారు. అసభ్యకరమైన వీడియోలను 48 గంటల్లో తీసేయాలని హెచ్చరించారు.

Manchu Vishnu strong warning to social media youtubers arj
Author
First Published Jul 10, 2024, 8:44 PM IST

`మా` అధ్యక్షుడు మంచు విష్ణు సోషల్‌ మీడియా, యూట్యూబర్స్ కి వార్నింగ్ ఇచ్చాడు. నటీనటులను అసభ్యకరమైన వీడియోలకు ఉపయోగిస్తే బ్యాన్‌ చేస్తామని, సైబర్‌ క్రైమ్‌ కేసు పెట్టి యాక్షన్‌ తీసుకుంటామని హెచ్చరించారు. నటీనటుల ఫోటోలు, వీడియోలు ఉపయోగించి వల్గర్‌గా వీడియోలు చేసిన వారందరు 48 గంటల్లో ఆయా వీడియోలను, సోషల్‌ మీడియా పోస్ట్ లను తీసేయకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. 

ఇందులో మాట్లాడుతూ, మన తెలుగు వారు పద్దతైన వాళ్లు, పద్ధతిగా ఉంటారు, మన ట్రెడిషన్‌ని ఫాలో అవుతుంటారని ప్రపంచమంతా అనుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో కొంత మంది తెలుగు వాళ్లు, ట్విట్టర్‌, ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ల్లో అసభ్యకరంగా బిహేవ్‌ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్లు ఎందుకు ఇలా బిహేవ్‌ చేస్తున్నారని అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది. రెండుమూడు రోజుల క్రితం సాయిధరమ్‌ తేజ్‌.. హనుమంతు అనే వ్యక్తి చేసిన వీడియో చాలా జుగుప్సా కరంగా ఉంది. దీనిపై చర్యలు తీసుకుంటామని స్పందించిన తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీలకు ధన్యవాదాలు. 

హనుమంతు అనే వ్యక్తికి కూడా మంచి ఫ్యామిలీ ఉంది. ఆయన ఎందుకు ఇలా బిహేవ్‌ చేసి ఉన్నారో అర్థం కావడం లేదు. ఆయన, ఆయన ఫ్రెండ్‌ అలా చేయడం దాంట్లో ఆనందం ఏముంది. ఒక చంటి బిడ్డ, రెండు మూడు ఏళ్లు కూడా ఉండని, ఆ బిడ్డ గురించి అంత సెక్సువల్‌గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది. దాని గురించి మాట్లాడితేనే ఒళ్లు జలదరిస్తుంది. అది చాలా తప్పు, మన తెలుగు వాళ్లం అలాంటి వాళ్లం కాదు. ఒక రెండు మూడు రోజులుగా నటీనటుల నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి చాలా లెటర్స్, ఈమెయిన్స్ వస్తున్నాయి. వీరంతా ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు, మీరు యాక్షన్‌ తీసుకోవాలని అడుగుతున్నారు. 

ఈ సందర్బంగా ఈ యూట్యూబర్స్, సోషల్‌ మీడియా బ్యాచ్‌ని ఓ ప్రశ్న అడుగుతున్నా. ఆడదంటే కేవలం సెక్సువల్‌గానే చూడాలా మీరు. మీకు మదర్‌, సిస్టర్‌, వైఫ్‌, డాటర్స్ లేరా?. సృష్టికి మూల కారణం ఆడది. వాళ్లకి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు మనం మనుషులుగా బతికేది వేస్ట్. మేమంతా నటీనటులం. తెలుగువారందరికి శిరస్సు వంచి నమస్కరిస్తాం. మీ వల్లే మేం ఈ స్థాయిలో ఉన్నాం. కానీ ఒక హీరోయిన్‌ గురించి, ఒక నటుడి వైఫ్‌ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, కామెంట్స్ పెట్టేది, డార్క్ హ్యూమర్‌ అని, ట్రోలింగ్‌ వీడియోలు అని, దానికింద మీరు దాక్కునేది కరెక్ట్ కాదు. 

నాకు బ్రహ్మానందం ఫోన్‌ చేసి నా ఫోటోలను మీమ్స్ లో వాడతారు. నేను ఎంజాయ్‌ చేస్తుంటాను. సరదాగా అనిపిస్తుంటుంది. కానీ  ఇలాంటి జుగుప్సాకరమైన వీడియోల్లో కూడా నా ఫోటోలు వాడుతున్నారు. ఇది ఎక్కడో ఓ చోట ఫుల్‌ స్టాప్‌ పెట్టాలి, మన తెలుగు వాళ్లం ఇలా కాదు. మీ జనరేషన్‌ మీరు చూసుకోవాలి అని ఆయన బాధపడ్డారు. ఈ సందర్భంగా యూట్యూబ్‌, సోషల్‌ మీడియా వాళ్లకి రిక్వెస్ట్ చేస్తున్నా. హీరోహీరోయిన్లపై అసభ్యకరంగా మాట్లాడే వారికి, ట్రోలింగ్‌ చేసే వారికి చెబుతున్నా, అలాంటి అసభ్యకరమైన వీడియోలను 48గంటల్లో తీసేయండి. మీరు తీయకపోతే 48 గంటల తర్వాత మేం యూట్యూబ్‌ వాళ్లతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం. అలాంటి వీడియోలు ఉంటే సైబర్‌ సెక్యూరిటీ కంప్లెయింట్‌ చేస్తాం. మీ యూట్యూబ్‌ ఛానెళ్లు కూడా బ్యాన్‌ అయ్యేలా లీగల్ యాక్షన్‌ తీసుకుంటాం. 

ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. మాకు ఈ విషయంలో సపోర్ట్ చేయండి. ఆ వీడియోస్‌ని తీసేయించండి` అని తెలిపారు మంచు విష్ణు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా ద్వారా వీడియోని పోస్ట్ చేశారు. ఇది వైరల్‌ అవుతుంది. మరి దీనిపై ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. మంచు విష్ణు మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios