నా ఫ్యామిలీ పేరు తీస్తే మామూలుగా ఉండదు..ఒళ్లు దగ్గరపెట్టుకోండి.. ప్రకాష్‌ రాజ్‌కి మంచు విష్ణు వార్నింగ్‌

మంచు విష్ణు మధ్యాహ్నం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ప్రకాష్‌పై దుమ్మెత్తిపోశారు. తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. మా నాన్నగారి పేరుగానీ, మా ఫ్యామిలీ పేరుగాని తీయకండని అని, ఫ్యామిలీ జోలికొస్తే మామూలుగా ఉండదన్నారు.

manchu vishnu strong warning to prakash raj regards maa election

ప్రకాష్‌ రాజ్‌కి కౌంటర్‌గా ఫైర్‌ అయ్యారు మంచు విష్ణు. కృష్ణం, కృష్ణంరాజు వంటి పెద్దలను కూడా అవమానిస్తారా? పెద్దలంటే లెక్కలేదా? ఇండస్ట్రీని ఆయనే శాషిస్తారా? అంటూ ప్రశ్నించారు manchu vishnu. ఈ రోజు(మంగళవారం) మార్నింగ్‌ ప్రకాష్‌ రాజ్‌.. మంచు విష్ణుపై పలు ఆరోపణలు చేశారు. `మా` ఎన్నికలకు సంబంధించి పోస్టర్‌ బ్యాలెట్‌ లో గోల్‌మాల్‌ జరిగిందని ఆరోపించిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో మంచు విష్ణు మధ్యాహ్నం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో prakash rajపై దుమ్మెత్తిపోశారు. తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. మా నాన్నగారి పేరుగానీ, మా ఫ్యామిలీ పేరుగాని తీయకండని అని, ఫ్యామిలీ జోలికొస్తే మామూలుగా ఉండదన్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడండి అని వార్నింగ్‌ ఇచ్చారు. `వస్తాడు నా రాజు` చిత్ర షూటింగ్‌ టైమ్‌లో ఏం జరిగిందో మర్చిపోయారా? ఆ చిత్ర దర్శకుడిని దుర్భాషలాడిన సమయంలో మీరు మా నాన్నగారి కాళ్లు తాకిన విషయం మర్చిపోయారా? ఇవన్నీ ఇప్పుడు మాట్లాడేలా చేస్తున్నారు. ఇప్పుడు శ్రీహరి గారు ఉంటే మీకు సరైన గుణపాఠం చెప్పేవారని అని ఫైర్‌ అయ్యారు.

related news: పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతుంది.. విష్ణు ప్యానెల్ పై ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ ఫిర్యాదు

మీ పొలిటికల్‌ ఎజెండాని ఇక్కడికి తీసుకురావద్దని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఉమ్మడి కుటుంబం అని, దీన్ని విడిదీయోద్దని, ఇండస్ట్రీలో ఒక్క ఫ్యామిలీని విడదీయోద్దని తెలిపారు. ఈ నెల 11 తర్వాత మనం కలవాల్సిన వాళ్లం. ముఖం చూసుకోకుండా చేయకండి` అని ఫైర్‌ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌, జీవితలకు సైతం వార్నింగ్‌ ఇచ్చారు మంచు విష్ణు. ప్రకాష్‌ రాజ్‌ ఇప్పుడు ఇక్కడ ఉంటాడు, తర్వాత వెళ్లిపోతాడు. ఆయన కోసం మీరు నోరు జారొద్దని శ్రీకాంత్‌కి వార్నింగ్‌ ఇచ్చారు మంచు విష్ణు. 

అదే సమయంలో జీవితని సైతం `మా నాన్న పేరుని మారు ప్రస్తావించకండి. నాలుగు రోజుల క్రితం రాజశేకర్‌ గారు వచ్చి ఏం మాట్లాడారో తెలియదా?` అంటూ ప్రశ్నించారు. అంతేకాదు కృష్ణ, కృష్ణంరాజు, శరత్‌బాబు వంటి వారు ఇండస్ట్రీ పెద్దలు. వారిని అవమానిస్తారా? వాళ్లకి గౌరవం ఇవ్వరా? ఇండస్ట్రీ పెద్దలను మర్యాద ఇచ్చి మాట్లాడాలని హితవు పలికారు. మా ఫ్యామిలీ జోలికొస్తే, మీ ఫ్యామిలీ గురించి మాట్లాడాలని, నీ గురించి మాట్లాడాలని ప్రకాష్‌రాజ్‌ని హెచ్చరించారు మంచు విష్ణు. 

ఎన్నికల విధానంపై, ప్రకాష్‌ పోస్టర్‌ బ్యాలెట్‌ పేపర్లకి సంబంధించిన చేసిన ఆరోపణలపై మంచు విష్ణు మాట్లాడుతూ, పేపర్‌ బ్యాలెట్‌పై వెళ్లాలని మేమే అనుకున్నాం. ఎన్నికల అధికారికి లెటర్‌ రాశాం. 60ఏళ్ల పై బడిన వాళ్లు `మా`లో 190 మందికిపైగా ఉన్నారు. వాళ్లందరితోనూ మాట్లాడాను. వంద మంది వరకు ఫిజికల్‌గా వచ్చి ఓటు వేస్తామన్నారు. కానీ మిగిలిన వాళ్లు పోస్టల్‌ బ్యాలెట్‌కి ప్రయారిటీ ఇచ్చారు. అయితే పోస్టల్‌ బ్యాలెట్‌ తీసుకోవాలంటే ఒక్కొక్కరు రూ.500చెల్లించాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్‌ వాళ్లకి చెబితే అర్థం కాలేదు. దీంతో తననే చెల్లించాలని, ఆ తర్వాత తాము ఇస్తామని వాళ్లు చెప్పడంతోనే తాను చెల్లించాను. 

ఆ తర్వాత ఎన్నికల అధికారి వాళ్లకి కాస్త టైమ్‌ ఇస్తామని, వాళ్లే చెల్లించేలా ప్లాన్‌ చేస్తామన్నారు. దీంతో ఆ అమౌంట్‌ని వెనక్కి తీసుకున్నామని తెలిపారు మంచు విష్ణు. తాము అంతా లీగల్‌గా చేశామని, ఎక్కడ సీక్రెట్‌ లేదని వెల్లడించారు. తనకు ప్రతి ఒక్క ఓటు ముఖ్యమని, అందుకే అందరితోనూ మాట్లాడానని వెల్లడించారు విష్ణు. ప్రకాష్‌ రాజ్‌ తమిళ చిత్రపరిశ్రమకి చెందిన నడిగర్‌ సంఘంలోనూ ఇన్‌వాల్వ్ అయి దాన్ని వివాదంగా మార్చారని, ఆ భవనానికి లాక్‌ వేసేలా చేశారని, అలాగే మలయాళానికి చెందిన `అమ్మా`లోనూ వేలు పెట్టి వివాదంగా మార్చారని ఆరోపించారు మంచు విష్ణు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios