ఆస్ట్రేలియా జట్టును సొంత గడ్డపై ఓడించి చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసి, ప్రతి ఇండియన్ కాలర్ ఎగరేసేలా చేశారు భారత్ క్రికెట్ జట్టు సభ్యులు. బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ ని 2-1తో కైవసం చేసుకుని సత్తా చాటారు. చివరిదైన మూడో టెస్ట్ లో భారీ స్కోరు ఛేదించి అసాధ్యం సుసాధ్యం చేశారు. యువ భారత జట్టు అందుకున్న ఈ విజయాన్ని దేశం మొత్తం ఒక పండగలా జరుపుకుంటున్నారు.

 కాగా ఈ టెస్ట్ విజయాన్ని హీరో మంచు విష్ణు ముందే ఊహించడం విశేషం. ఉత్కంఠ మధ్య భారత్ గబ్బా టెస్ట్ మ్యాచ్ గెలుచుకుంటుందని ఒకరోజు ముందే ఆయన చెప్పారు. ఈమేరకు మంచు విష్ణు ట్వీట్ చేయడం జరిగింది. అలాగే భారత జట్టు మ్యాచ్ గెలిచిన అనంతరం ఆయన మరో ట్వీట్ చేశారు. ఫన్టాస్టిక్ విన్... యాహూ, గో ఇండియా.. అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక భారత జట్టు సాధించిన చారిత్రాత్మక విజయంపై అనేక మంది చిత్ర ప్రముఖులు స్పందించారు. మహేష్, అమితాబ్, వెంకటేష్ వంటి ప్రముఖులు ఈలిస్ట్ లో ఉన్నారు. 

మరోవైపు మంచు విష్ణు మోసగాళ్లు మూవీలో నటిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. కాజల్ అగర్వాల్ మరో ప్రధాన పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పోలీసులుగా స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వనున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక రోల్ చేస్తున్నారు.