మంచు విష్ణు ఈ మధ్యకాలంలో తన సినిమాల జోరు కాస్తంత తగ్గించారు. వేరే బిజినెస్ ల మీద ఆయన దృష్టిని కేటాయించారు. అయితే సినిమాల్లోకి వచ్చాక...గ్యాప్ వచ్చినా మళ్లీ తిరిగి విజృంభించాలనే అనిపిస్తుంది. అలాగే మంచు విష్ణుకు ఇప్పుడు మరో సినిమా చెయ్యాలనిపించింది. అందుకోసం ఆయన ఓ టైటిల్ ని సైతం ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. ఆ టైటిల్ వింటే ఆశ్చర్యపోతారు. ఆ టైటిల్ మరేదో కాదు..'ఫసాక్' .

ఆ మధ్యన  సీనియర్ నటుడు... నిర్మాత మోహన్ బాబు ఈ లిస్టుకు 'ఫసాక్' అనే పదాన్ని కనిపెట్టి ప్రపంచానికి పరిచయం చేసారు. ఆ పదం కొద్ది గంటల్లోనే తెలుగు వారి హాట్ ఫేవరెట్ పదంగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఈ పదం  పై వచ్చినన్ని జోక్ లు ఈ మధ్యకాలంలో దేని మీదా రాలేదు అంటే అతిశయోక్తి కాదు. చివరకు ఈ పదం పాపులారిటి ఏ స్దాయికి వెళ్లిదంటే...  ఒక నార్త్ హీరోయిన్ ఒక ట్వీట్ లో "అసలు ఫసాక్ ఏంటి?" అని అడింది. 

అంతేకాదు ఫసాక్ పై చాలా స్పూఫ్ లు వచ్చాయి.  మంచు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ఫసాక్ స్పూఫులను ఎంజాయ్ చేసి...  ఎంతో జోవియల్ గా స్పందించారు.  ఇప్పుడు ఈ 'ఫసాక్' నే టైటిల్ గా పెట్టి మంచు విష్ణు సినిమా చేయబోతున్నారు. మంచు సొంత బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై 'ఫసాక్' టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు.   మరి ఏ డైరక్టర్ తో ఈ సినిమా చేయబోతున్నారో ఇంకా తెలియరాలేదు.