తప్పు చేస్తే బహిష్కరించే అధికారం ‘మా’ కు ఉంది

First Published 19, Apr 2018, 12:41 PM IST
Manchu vishnu letter to maa association on sri reddy issue
Highlights

మా పై ఫైర్ అయిన మంచు విష్ణు

టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంపై మంచువిష్ణు స్పందించారు. బాధితుల ఆరోపణలపై ‘మా’ అసోసియేషన్ స్పందించిన తీరును తప్పుబడుతూ ఆయన లేఖ రాశారు. మా తీసుకున్న నిర్ణయాలు అయోమయానికి గురి చేస్తున్నాయన్న విష్ణు.. తప్పు చేస్తే బహిష్కరించే అధికారం ‘మా’ కు ఉందన్నారు. సినీ ప్రముఖులు, టాలీవుడ్‌ మీద పలు ఆరోపణలు చేసిన నటిపై.. బహిష్కరణ వేయడం.. తిరిగి ఉపసంహరించుకోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని తన లేఖలో పేర్కొన్నారు.

మా నిర్ణయాల వల్ల టాలీవుడ్‌ పట్ల దేశవ్యాప్తంగా చులకన భావం ఏర్పడిందని.. ‘మా’లో సభ్యత్వం లేని వారితో కూడా చాలాసార్లు నటించాం, నటిస్తున్నాం అని చెప్పారు. మా అసోసియేషన్‌లో తగిన గైడ్‌లైన్స్‌ రూపొందించాలని.. ఇండస్ట్రీలో పని చేస్తున్న వారి కోసం.. గ్రీవెన్స్‌సెల్‌ ఏర్పాటు చేయాలని మంచు విష్ణు డిమాండ్ చేశారు.

loader