Asianet News TeluguAsianet News Telugu

మంచువిష్ణు కూడా ఆ దందా స్టార్ట్ చేస్తాడట!

సిల్వర్‌స్క్రీన్లకు ప్రత్నామ్నాయంగా ఓటీటీ రూపంలో డిజిటల్‌ స్క్రీన్లు వచ్చేశాయి. సెల్‌ఫోన్‌లోనే సినిమాలు చూసే అవకాశాన్ని తెచ్చాయి. లో బడ్జెట్‌ మూవీస్‌ నుంచి మిడిల్‌ బడ్జెట్‌ చిత్రాల వరకు ఇప్పుడు ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. బాలీవుడ్‌లో అయితే ఏకంగా స్టార్‌ హీరోల చిత్రాలే ఓటీటీలో రిలీజ్‌ కానుండటం విశేషం. 

manchu vishnu is planning to launch ott
Author
Hyderabad, First Published Aug 8, 2020, 9:33 AM IST

కరోనా అన్నింటిని తలక్రిందులు చేస్తుంది. థియేటర్ల స్థానంలో డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్స్ అయిన ఓటీటీలు పుట్టుకొచ్చాయి. వైరస్‌ ఇంకా అంతం కాకపోగా, పైగా మరింత విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో థియేటర్లు ఇప్పట్లో ఓపెన్‌ అయ్యే పరిస్థితి లేదు. దీంతో సిల్వర్‌స్క్రీన్లకు ప్రత్నామ్నాయంగా ఓటీటీ రూపంలో డిజిటల్‌ స్క్రీన్లు వచ్చేశాయి. సెల్‌ఫోన్‌లోనే సినిమాలు చూసే అవకాశాన్ని తెచ్చాయి. లో బడ్జెట్‌ మూవీస్‌ నుంచి మిడిల్‌ బడ్జెట్‌ చిత్రాల వరకు ఇప్పుడు ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. బాలీవుడ్‌లో అయితే ఏకంగా స్టార్‌ హీరోల చిత్రాలే ఓటీటీలో రిలీజ్‌ కానుండటం విశేషం. 

దీంతో ఓటీటీలకు డిమాండ్‌ పెరుగుతుంది. ఒకవేళ థియేటర్లు ఓపెన్‌ అయినా జనం అంత ఈజీగా థియేటర్‌కి రారు, ఇప్పటికే ఓటీటీకి ఎంతో కొంత అలవాటు పడటంతో సాధ్యమైనంత వరకు ఇంట్లోనే చూసేందుకు ఇష్టపడతారు. అందుకే వీటికి ఎప్పటికైనా డిమాండ్‌ ఉంటుంది. ఇప్పటికే తెలుగులో అమేజాన్‌ ప్పైమ్‌, నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్‌, ఆహా, జీ5తోపాటు శ్రేయాస్‌, ఆర్జీవీ వరల్డ్, అలాగే ప్రతాని రామకృష్ణగౌడ్‌, మరో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఓటీటీలు, ఏటీటీలు పెట్టారు. 

ఇక మంచు ఫ్యామిలీ నుంచి మరో ఓటీటీ రాబోతుందట. ఓటీటీలకు ఉన్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని మంచు కుటుంబం కూడా ఓ డిజిటల్‌ ఫ్లాట్‌ ఫామ్‌ని స్టార్ట్ చేయ‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. హీరో, నిర్మాత అయిన మంచు విష్ణు ఆ దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు టాక్‌. వీరు న‌టించే సినిమాలతోపాటు కొన్ని వెబ్ సిరీస్‌ల‌ను కూడా నిర్మించి వాటిల్లో విడుదల చేయాలనుకుంటన్నట్టు తెలుస్తుంది. ఇది వ‌ర‌కే మంచు విష్ణు `చ‌ద‌రంగం` అనే వెబ్ సిరీస్‌ను నిర్మించి జీ5లో విడుదల చేశారు. చాలా రోజులుగా హిట్‌ లేని మంచు విష్షు ప్రస్తుతం `మోసగాళ్ళు`తోపాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios