గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమవుతున్న యువ హీరో మంచు విష్ణు ప్రస్తుతం ఒక హాలీవుడ్ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒక షెడ్యూల్ షూటింగ్ ని కూడా ముగించారు. కాజల్ అగర్వాల్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. బాలీవుడ్ సీనియర్ హీరో కూడా విష్ణు సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. 

అతనెవరో కాదు. కండల వీరుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరో సునీల్ శెట్టి. సొంత బ్యానర్ లో మంచు విష్ణు మరికొంతమంది హాలీవుడ్ ప్రముఖులతో కలిసి ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా చిత్ర దర్శకుడు జెఫరీ చిన్ తో కలిసి సునీల్ శెట్టిని కలిసిన విష్ణు కథను వినిపించినట్లు తెలుస్తోంది. 

కథ నచ్చడంతో పాటు తన క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో సింగిల్ సిట్టింగ్ లో సునీల్ శెట్టి కథను ఒకే చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే హైదరాబాద్ లో స్టార్ట్ కానున్న మరో షెడ్యూల్ లో ఈ బాలీవుడ్ హీరో చిత్ర యూనిట్ తో కలవనున్నారు. ఇక సినిమాపై ఇంతవరకు పెద్దగా ఎనౌన్సమెంట్స్ ఇవ్వని మంచు విష్ణు త్వరలో టైటిల్ తో సహా టీజర్ ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.