మంచు విష్ణు కొడుకు పేరు భలే వుంది.. మోహన్ బాబు పేరుతో కనెక్షన్

మంచు విష్ణు కొడుకు పేరు భలే వుంది.. మోహన్ బాబు పేరుతో కనెక్షన్

మంచు ఫ్యామిలీలోకి నూతన సంవత్సరం రోజున మూడో తరంలో వారసుడొచ్చిన సంగతి తెలిసిందే. మంచు విష్ణుకి కొడుకు పుట్టాక ఆ ఫ్యామిలీలో ఆనందానికి అవధులు లేవు. ఒక వైపు గాయత్రి సినిమా కార్యక్రమాల్లో మోహన్ బాబు - విష్ణు ఇద్దరు బిజీగా ఉన్న టైం లోనే ఈ శుభవార్త తెలియడం వారి సంతోషాన్ని రెట్టింపు చేసింది. నూతన సంవత్సరం నాడే వెరొనిక పండంటి  మగబిడ్డకు జన్మనియ్యటంతో ఫ్యామిలీ అంతా హ్యాపీగా వుంది.

 

కొడుకు పుట్టిన ఆనందంతో తెగ సంబరపడిపోతున్న విష్ణు ఈ సందర్భంగా తన కొడుకు పేరుని ట్విట్టర్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు. పేరు అవ్రామ్ భక్త మంచు. తండ్రి మోహన్ బాబు అసలు పేరు భక్త వత్సలం నాయుడు. సినిమాల్లోకి వచ్చాక గురువు దాసరి సలహా మేరకు పేరు మార్చుకున్నారు. అందుకే నాన్నకు కృతజ్ఞతగా ఆయన అసలు పేరులోని మొదటి పదాన్ని భక్తగా తీసుకున్నారు.

 

తన ట్వీట్ లో అవ్రామ్ అంటే మీనింగ్ ఏంటో కూడా చెప్పాడు విష్ణు. అవ్రం అంటే ఎవరు ఆపలేని వాడు. బాగుంది. పేరులోనే అతను ఎక్కడికి చేరుకోవాలో ఎలా ఉండాలో చెప్పేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళు ఎలా పిలుస్తారో కూడా విష్ణు చెప్పేసాడు. అవ్రామ్ కి ఇద్దరు అక్కయ్యలు. ఒక అక్క అరియానా తనను బేబీ లయన్ అని పిలిస్తే మరో అక్క వివియానా బేబీ టెడ్డిబేర్ అని పిలుస్తుంది. ఇక ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్ళు అసలు పేరుతోనే పిలుస్తారట.

 

మంచు విష్ణుకి ఈ సంవత్సర ప్రారంభం గ్రాండ్ గా ఉండబోతోంది. తనకు అచ్చి వచ్చిన దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి తో చేసిన ఆచారి అమెరికా యాత్ర జనవరి చివరి వారంలో విడుదల కానుండగా తను స్పెషల్ రోల్ చేసిన నాన్న సినిమా గాయత్రి ఫిబ్రవరి రెండో వారంలో విడుదల కానుంది. వారసుడు వచ్చిన వేళా విశేషం ఆ రెండు కనక హిట్ అయితే ఇక ఆ ఆనందం రెట్టింపు అయిపోదూ.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page