మంచు ఫ్యామిలీ హీరోలకు టాలీవుడ్ సరిపోలేనట్లుంది. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ కి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే.. మంచు విష్ణు ఈ మధ్యకాలంలో ఒక్క హిట్టు కూడా అందుకోలేదు.

మంచు మనోజ్ పరిస్థితి కూడా అంతే.. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మంచు విష్ణు 'కన్నప్ప' స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడు. ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్లభరణి ఈ కథను తయారు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పనులు ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్నాయి. ఈ సినిమాకు మొత్తం హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేయబోతున్నారు. 

మంచు విష్ణు ఈ సినిమాలో నటించడంతో పాటు నిర్మాతగా కూడా పని చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ కథను ఓ హాలీవుడ్ డైరెక్టర్  తెరకెక్కించబోతున్నాడని సమాచారం. ఈ సినిమా కథ విన్న ఓ హాలీవుడ్ డైరెక్టర్ ఇంప్రెస్ అయి డైరెక్షన్ తనే చేస్తానని అడిగారట. దీంతో ఇప్పుడు ఆయన దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమా సంగతి పక్కన పెడితే.. మంచు విష్ణుకి ఓ హాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందట. ఓ మంచి స్క్రిప్ట్ ఒకటి మంచు విష్ణు వద్దకు వచ్చిందని, దానిని కేవలం ఇంగ్లీష్ సినిమాగానే రూపొందించాలని భావిస్తున్నారట. అంటే మంచు హీరో హాలీవుడ్ లో నటించడానికి రెడీ అవుతున్నారన్నమాట. మరి తెలుగులో రాని హిట్లు హాలీవుడ్ లో వస్తాయేమో చూడాలి!