కరోనా విజృంభిస్తోంది. దేశం మొత్తం ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇప్పటికే 45ఏళ్లు పై బడిన వాళ్లకి వ్యాక్సిన్‌ వేస్తున్నారు. సినీ సెలబ్రిటీలు సైతం వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నారు. `సీసీసీ` నుంచి సినీ కార్మికులకు, జర్నలిస్ట్ లకు వ్యాక్సిన్‌ అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇక కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఆయన సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ని ఈ ఆదివారం ఉదయం వేయించుకున్నారు. 

ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్‌ చేశారు మోహన్‌బాబు. `సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కోరుకుంటున్నా. అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతి సారి కచ్చితంగా మాస్క్ ధరించాలని మోహన్‌బాబు చెప్పారు. మోహన్‌బాబు ప్రస్తుతం `సన్నాఫ్‌ ఇండియా` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తుండటం విశేషం. 

ఇదిలా ఉంటే టాలీవుడ్‌ని కూడా కరోనా వెంటాడుతుంది. ఇప్పటికే హీరో పవన్‌ కళ్యాణ్‌, కళ్యాణ్‌ దేవ్‌, హీరోయిన్‌ నివేదా థామస్‌, నిర్మాతలు అల్లు అరవింద్‌, దిల్‌రాజు, బండ్ల గణేష్‌, దర్శకుడు త్రివిక్రమ్‌, కరోనాకి గురైన విసయం తెలిసిందే. వారు కోలుకున్నారు. మరోవైపు కరోనాతో చిత్ర పరిశ్రమ మొత్తం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే థియేటర్లని బంద్‌ చేశారు. మరోవైపు స్టార్‌ హీరోలంతా తమ షూటింగ్‌లను వాయిదా వేసుకుంటున్నారు. మరో నెల వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశాలున్నాయి.