యువ హీరో మంచు మనోజ్ మరో కొత్త సినిమా కోసం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం వచ్చిన ఒక్కడు మిగిలాడు సినిమా అనంతరం దాదాపు సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా సరికొత్త కథను సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. గత ఏడాది ఎలక్షన్స్ కి ముందు వరకు మనోజ్ రాజకీయాల్లోకి వెళుతున్నట్లు టాక్ వచ్చింది.

ఇక ఇప్పుడు మళ్ళీ తన రెగ్యులర్ సినీ కెరీర్ తో బిజీ కావాలని మనోజ్ కష్టపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం తన కొత్త సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఈ యువ హీరో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త ఫిట్ నెస్ తో కనిపించడానికి మనోజ్ ట్రై చేస్తున్నాడు. చాలా వరకు బరువు తగ్గినట్లు తెలుస్తోంది. 

ఇక రీసెంటట్ గా సోషల్ మీడియాలో ఒక ఫొటో కూడా పోస్ట్ చేశాడు. మనోజ్ ఫాలోవర్స్ ని ఆ స్టిల్ ఆకట్టుకుంటోంది. మరి ఈ కమ్ బ్యాక్ ఫిల్మ్ తో యువ హీరో ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి. త్వరలోనే సినిమాకు సంబందించిన స్పెషల్ అప్డేట్ వెలువడనున్నట్లు సమాచారం.