Asianet News TeluguAsianet News Telugu

సైదాబాద్ ఘటన: నిందితుడు రాజు ఆత్మహత్య.. కేటీఆర్ కు థ్యాంక్స్ చెప్పిన మంచు మనోజ్

సైదాబాద్ చిన్నారి ఘటన దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. మానవ మృగం రాజు.. చిన్నారి చిత్రాన్ని అత్యంత పాశవికంగా రేప్ చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. 

Manchu Manoj Responds on Accused Raju suicide
Author
Hyderabad, First Published Sep 16, 2021, 12:57 PM IST

సైదాబాద్ చిన్నారి ఘటన దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. మానవ మృగం రాజు.. చిన్నారి చిత్రాన్ని అత్యంత పాశవికంగా రేప్ చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. దీనితో తెలంగాణ పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. 

రాజు పట్టిస్తే 10 లక్షల రివార్డ్ ఇస్తామని కూడా పోలీసులు ప్రకటించారు. దీనితో ఈ సంఘటనపై సినీ హీరోలు మహేష్, మంచు మనోజ్, నాని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నిందితుడిని త్వరగా అరెస్ట్ చేసి ఉరితీయాలని అంతా భావిస్తున్న తరుణంలో రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. 

పోలీసులకు దొరికితే చిత్ర హింసలు పెడతారనే భయంతో రాజు రైలు పట్టాలపై పడి సూసైడ్ చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా అతడికోసం జల్లెడపడుతున్న పోలీసులు స్టేషన్ ఘనపూర్ వద్ద రైల్వే ట్రాక్ పై రాజు మృత దేహాన్ని గుర్తించారు. 

అతడి చేతికి ఉన్న టాటూ ద్వారా మరణించింది రాజేనని పోలీసులు నిర్ధారించారు. బతికే అర్హత లేని కీచకుడు మరణించడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మొదటి నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్న హీరో మంచు మనోజ్ తాజాగా స్పందించాడు. రాజు మృతిపట్ల హర్షం వ్యక్తం చేశాడు. 

రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు డిజిపి ధృవీకరించారని కేటీఆర్ ట్వీట్ చేశారు.మనోజ్ ఈ ట్వీట్ కు బదులిస్తూ.. ఈ వార్త చెప్పినందుకు థ్యాంక్యూ సర్.. దేవుడు ఉన్నాడు అని మనోజ్ ట్వీట్ చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios