అక్క నువ్వు గ్రేట్ అంటున్నాడు మంచు మనోజ్. నీలాంటి మంచి మనస్సు అందరికి ఉండదూ అంటూ.. పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. ఇంతకీ అంతాలా మంచు లక్ష్మి ఏం చేసింది...?  

మంచు లక్ష్మిపై మంచు మనోజ్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. తన అక్క మంచు లక్ష్మిని ఆకాశానికి ఎత్తుతూ.. పొగడ్తలతో ముంచెత్తుతూ.. మనోజ్ పోస్ట్ పెట్టాడు. అంతే కాదు అక్కను చూస్తుంటే.. చాలా గర్వంగా ఉందంటూ ఒక పోస్ట్ వేశాడు. మనోజ్ ఇంతలా పొగడటానికి చాలా పెద్ద కారణమే ఉంది. మంచు లక్ష్మి నిజంగా చాలా గొప్ప పని చేసింది. అందుకే తన అక్క గురించి మంచు హీరో ఆ పోస్ట్ పెట్టాడు. ఇంతకీ మంచు లక్ష్మి ఏమి చేసిందో తెలుసా..? 

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చి.. నటిగా, హోస్ట్ గా.. నిర్మాతగా.. మోడల్ గా.. ఇలా చాలా రంగాలలో మంచు లక్ష్మీ దూసుకుపోతోంది. తెలుగు సినీ పరిశ్రమలో.. తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న లక్ష్మి.. అటు పలు సేవ కార్యక్రమాలు కూడా చేస్తూ తన గొప్ప మనసుని చాటుతుంటుంది. ముఖ్యంగా.. టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ అనే ఒక ఎన్జీవోని స్థాపించి గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంటూ వస్తుంది.

View post on Instagram

డబ్బు ఉన్నవారితో పాటు.. పేదవారు కూడా ఉన్నత చదువులు చదవాలి అనే ఉద్దేశ్యంతో.. ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని..వాటిలో అత్యాధునిక వసతులు, స్మార్ట్ క్లాసులు, ఇంగ్లీష్ క్లాసులు ఏర్పాటు చేస్తూ కార్పొరేట్ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్స్ లో విద్య అందించేలా ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే శ్రీకాకుళం, యాదాద్రి జిల్లాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 కు పైగా ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంది. 

ఇక ఈకార్యక్రమంలో బాగంగా.. రీసెంట్ గా.. జోగుళాంబ గద్వాల జిల్లాలో మరో 30 పాఠశాలలను కూడా దత్తతకు తీసుకుంది మంచు లక్ష్మి వాటిని కూడా స్మార్ట్ స్కూల్స్ గా మార్చి.. విదార్ధులకు మంచి భవిష్యత్తు అందిస్తామన్నారు మంచు లక్ష్మి. ఇక మంచు లక్ష్మి చేస్తున్న ఈ మంచి పనిని మెచ్చుకుంటూ.. అక్కా నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది అంటున్నాడు మంచు మనోజ్. ఈ విషయం గురించే ఆయన పోస్ట్ వేశాడు.