శుక్రవారం రోజు మంచి ఫ్యామిలిలో జరిగిన సంఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. గతంలో ఎంతో అన్యోన్యంగా ఉన్న మంచు సోదరులు.. విష్ణు, మనోజ్ మధ్య మనస్పర్థలు ఉన్నట్లు నిన్నటి ఘటనతో స్పష్టంగా అర్థం అయింది.

శుక్రవారం రోజు మంచి ఫ్యామిలిలో జరిగిన సంఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. గతంలో ఎంతో అన్యోన్యంగా ఉన్న మంచు సోదరులు.. విష్ణు, మనోజ్ మధ్య మనస్పర్థలు ఉన్నట్లు నిన్నటి ఘటనతో స్పష్టంగా అర్థం అయింది. మంచు విష్ణు తన అనుచరులు బంధువులపై దాడికి దిగుతున్నాడు అంటూ మనోజ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ మీడియాలో ఎంత హాట్ టాపిక్ అయిందో అందరికి తెలిసిందే. 

ఈ ఘటనతో మంచు ఫ్యామిలీ పరువు రచ్చకెక్కింది అనే చెప్పాలి. కుటుంబ పరువు సమస్య కావడంతో వెంటనే మోహన్ బాబు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశారు. మంచు విష్ణు కూడా రంగంలోకి దిగి అది తన తమ్ముడితో జరిగిన చిన్నపాటి వివాదమే అని .. దీని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చాడు. 

మంచు మనోజ్ మాత్రం స్పందించలేదు. అయితే మనోజ్ ఈ గొడవ తర్వాత చేసిన తొలి ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ లో తన ఫ్యామిలిలో జరిగిన వివాదం గురించి చేసింది కాదు. శుక్రవారం రోజు తమిళ స్టార్ హీరో తలా అజిత్ తండ్రి పి. సుబ్రహ్మణ్యం మరణించిన సంగతి తెలిసిందే. దీనితో అజిత్ ఫ్యామిలీకి సానుభూతి తెలిపేందుకు మనోజ్ ట్వీట్ చేశారు. 

'పిఎస్ మణి'గారు మరణించారని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి. ఈ విషాద పరిస్థితుల్లో అజిత్ కుటుంబానికి నా ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నా' అని మనోజ్ ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

ఈ ట్వీట్ పై మనోజ్ అభిమానులు భిన్నంగా స్పందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. 'అన్నా మీ ఇంట్లో పరిస్థితులు త్వరగా చక్కబడాలి.. టెక్ కేర్' అని ఓ అభిమాని కామెంట్ పెట్టారు. మరో అభిమాని.. త్వరగా వివాదం సద్దుమణిగేలా ఏదోఒకటి చేయండి.. లేకుంటే మీడియాలో ఈ రచ్చ ఎక్కువవుతోంది అని కామెంట్స్ చేశారు. గొడవలు జరుగుతూ ఉంటాయి..మళ్ళి కలిసిపోండి అని మరో నెటిజన్ పేర్కొన్నారు.