భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికా రెడ్డిని హీరో మంచు మనోజ్‌ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా అధికారికంగా ప్రకటించారు మంచు హీరో. 

మంచు మనోజ్‌.. భూమా మౌనికా రెడ్డి గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి కొంత కాలం సహజీవనం చేసినట్టు వార్తలొచ్చాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. నేడు వీరిద్దరు పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలిసింది. కానీ ఇప్పటి వరకు భూమా మౌనికారెడ్డితో పెళ్లినిగానీ, ప్రేమ విషయాన్ని గానీ అధికారికంగా ప్రకటించలేదు మనోజ్‌. తాజాగా అధికారికంగా ప్రకటించారు. కాబోయే భార్యని పరిచయం చేశారు. 

ట్విట్టర్‌ ద్వారా పెళ్లికూతురు అంటూ భూమా మౌనికా రెడ్డి ఫోటోని పంచుకున్నారు. పెళ్లికి ముస్తాబవున్న భూమా మౌనికారెడ్డి.. కూర్చొని ఉన్న ఫోటో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో `పెళ్లికూతురు` అంటూ `మనోజ్‌ వెడ్స్ మౌనికా` అనే యాష్‌ ట్యాగ్‌ని షేర్‌ చేశారు. నేడు శుక్రవారం(మార్చి 3న) వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. కాగా వీరిద్దరికి ఇది రెండో పెళ్లి అనే విషయం తెలిసిందే. 

Scroll to load tweet…

ఇక హైదరాబాద్‌లోనే తన సోదరి మంచు లక్ష్మి ఇంట్లో ఈ రోజు రాత్రి 8.30 గంటలకు ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరగనుందని సమాచారం. ఇక తాజాగా మంచు మనోజ్‌ పంచుకున్న ట్వీట్‌కి వారి అభిమానులు స్పందిస్తున్నారు. కాబోయే కొత్త జంటకి విషెస్‌ తెలియజేస్తున్నారు.