మంచు మనోజ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సడెన్ గా మంచు మనోజ్ తిరుపతికి వెళ్లడం, అక్కడ సేవా చేయాలనుకోవడం వంటి విషయాలు ఈ వార్తలకి బలాన్ని చేకూర్చాయి.

రీసెంట్ గా సోషల్ మీడియాలో పవన్ ని పొగుడుతూ పోస్ట్ పెట్టడంతో అతడు జనసేన పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు మంచు మనోజ్ స్వయంగా తను ఏ పార్టీలో చేరితో బాగుంటుందనే విషయంపై స్పందించాడు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంచు మనోజ్ తన అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెబుతుంటాడు. తాజాగా ఓ నెటిజన్ ''మీ పొలిటికల్ కెరీర్ కి ఏ పార్టీ బెస్ట్'' అని ప్రశ్నించారు. దీనిపై మనోజ్ చాలా సరదాగా స్పందిస్తూ.. 'టీ పార్టీ' అని ఆన్సర్ చేశాడు.

దీనిపై నెటిజన్లు కూడా అంతే సరదాగా స్పందిస్తూ ట్వీట్లు పెడుతున్నారు. కొందరు పార్టీ పేరు బాగుందని, మిడిల్ క్లాస్ జనాలకి కనెక్ట్ అవుతుందని కామెంట్ చేయగా.. మరొకొందరు ట్విట్టర్ లో కూడా మీ కామెడీనే ట్రెండ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు..

పవన్ పార్టీలోకి మంచు మనోజ్..?

రాజకీయాలకి లింక్ చేయకండి: మంచు మనోజ్

మనోజ్ కొత్త జర్నీ.. ప్రపంచమంతా విస్తరింపజేస్తాడట! 

మంచు మనోజ్ 'లేఖ' వెనక అసలు స్కెచ్ ఇదా?