Asianet News TeluguAsianet News Telugu

ఫ్రెండ్స్ తో ఫుల్ బిందాస్ గా మంచు మనోజ్.. ఆ గ్యాంగ్ లో మెగా డైరెక్టర్ కూడా..

మంచు మనోజ్ ఎంజాయ్ మూడ్ లోకి వచ్చేశారు. తాజాగా మంచు మనోజ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. నేడు సండే కాబట్టి మంచు మనోజ్ తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో ఫుల్ బిందాస్ గా గడిపాడు.

manchu manoj enjoying this sunday with his friends
Author
First Published Mar 26, 2023, 8:25 PM IST

ఇటీవల మంచు ఫ్యామిలిలో జరిగిన గొడవలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. గతంలో ఎంతో అన్యోన్యంగా ఉన్న మంచు సోదరులు.. విష్ణు, మనోజ్ మధ్య మనస్పర్థలు ఉన్నట్లు నిన్నటి ఘటనతో స్పష్టంగా అర్థం అయింది. మంచు విష్ణు తన అనుచరులు బంధువులపై దాడికి దిగుతున్నాడు అంటూ మనోజ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ మీడియాలో ఎంత హాట్ టాపిక్ అయిందో అందరికి తెలిసిందే. 

అయితే మనోజ్, విష్ణు మధ్య జరిగిన సంఘటన ప్రతి ఫ్యామిలిలో ఉండే చిన్న చిన్న వివాదాలే అని మంచు ఫ్యామిలీ వివరణ ఇచ్చుకుంది. మోహన్ బాబు, కుటుంబ పెద్దలు ఇన్వాల్వ్ అయి అన్నదమ్ముల వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే పరిస్థితులు కాస్త చక్కబడ్డాక మంచు మనోజ్ ఎంజాయ్ మూడ్ లోకి వచ్చేశారు. తాజాగా మంచు మనోజ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. నేడు సండే కాబట్టి మంచు మనోజ్ తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో ఫుల్ బిందాస్ గా గడిపాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపాడు. మంచు మనోజ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో మెగా డైరెక్టర్ బాబీ కూడా ఉండడం విశేషం. 

నా డార్లింగ్ బ్రదర్స్ డైరెక్టర్ బాబీ, డైరెక్టర్ వంశి, కిరణ్ గిరజాల లతో ఈ ఆదివారం అద్భుతంగా గడిచింది. మన సంభాషణ ఎంతోబావుంది. నా కోసం మీ ఇళ్ల నుంచి మంచి భోజనం తెచ్చినందుకు థాంక్యూ. ఇలాంటి సరదా సంఘటనలు జరుగుతూనే ఉండాలి అంటూ మనోజ్ ట్వీట్ చేశారు. 

మంచు మనోజ్ ఇటీవలే రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాగ్రౌండ్ కలిగిన భూమా మౌనిక మనోజ్ వివాహం జరిగింది. ఇద్దరూ చాలా కాలం నుంచి రిలేషన్ లో ఉన్నారు. మంచు లక్ష్మి నివాసంలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios