అసెంబ్లీ రద్దుపై.. మంచు మనోజ్ కామెంట్!

First Published 7, Sep 2018, 3:31 PM IST
manchu manoj comments on telangana assembly dissolution
Highlights

నటుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు మంచు మనోజ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా గడుపుతున్నాడు. ఈ మధ్యకాలంలో అతడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగా
పెరిగింది

నటుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు మంచు మనోజ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా గడుపుతున్నాడు. ఈ మధ్యకాలంలో అతడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగా పెరిగింది. అతడు చేసిన కొన్ని పనుల కారణంగా అందరికీ ఫేవరేట్ హీరోగా మారుతున్నాడు.

మిగిలిన హీరోలతో పోలిస్తే మంచు మనోజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. విసుక్కోకుండా.. అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ సొసైటీలో జరిగే కొన్ని విషయాలపై స్పందిస్తుంటాడు. ఇటీవల 'మా' వివాదంపై స్పందించిన మంచు మనోజ్ తాజాగా అసెంబ్లీ రద్దుపై కామెంట్ చేశాడు. కేసీఆర్, కేటీఆర్ ల ఫోటోలను ట్వీట్ చేస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాడు. 

''స్వయం పాలన కోసం ఏళ్లపాటు పోరాటం.. త్యాగాలతో ఏర్పాటు చేసుకున్న మొదటి శాసన సభను రద్దు చేయడం కొంచెం బాధగానే ఉంది. కానీ, ఏదైనా సరే మంచి కోసమే. ప్రజల కోసం మీరు తప్పకుండా తిరిగి వస్తారని భావిస్తున్నా. ఈ మార్పును నమ్మనివారి ఆలోచన తప్పని మీరు నిరూపించారు. మీకు మరింత బలం చేకూరాలి'' అంటూ రాసుకొచ్చాడు. 

 

loader