సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మంచు మనోజ్ తాజాగా ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్ ఓ పాట పాడారు.

అది రాజకీయాలకు సంబంధించిన పాట. ప్రస్తుతం కేఏ పాల్ ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ తరఫున అభ్యర్ధులను నిలబెడుతున్నాడు. తమ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో 'నేను మీ ఊర్లన్నీ వస్తాను.. రాయలసీమ, గుంటూరు వస్తాను' అంటూ క్రిస్టియన్ పాటల స్టైల్ లో ఓ రాజకీయ పాట పాడారు. ఈ పాట విన్న రామ్ గోపాల్ వర్మ నవ్వుతున్న ఎమోజీలను పెట్టి వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఇది చూసిన మంచు మనోజ్ తను ఎంతగా ప్రాక్టీస్ చేస్తున్నా.. ఆ పాట రావడం లేదని కామెంట్ పెట్టాడు. ''సార్ ఎపిక్ వీడియో. నేను ఆ పాటను ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ ఆ ప్రపంచనేత(కేఏ పాల్) పాడినట్లుగా నేను పాడలేకపోతున్నాను'' అంటూ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు. ఇది చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.