ఇటీవల మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మంచు మనోజ్ స్పందించారు. దీనికి సంబంధించి నిన్న ఓ వీడియాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇటీవల మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మంచు మనోజ్ స్పందించారు. దీనికి సంబంధించి నిన్న ఓ వీడియాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోని తప్పుగా అర్ధం చేసుకున్న కొందరు నెటిజన్లు తనను తప్పుబడుతూ వ్యక్తిగతంగా దూషిస్తున్నారంటూ మంచు మనోజ్ ఓ పోస్ట్ పెట్టాడు.

''డియర్ థింకర్స్.. నేను వీడియోలో మాట్లాడిన విషయాలను సరిగ్గా అర్ధం చేసుకోండి. మీ సొంతంగా ఏవేవో ఊహించుకోకండి. పదో తరగతిలో జాతి, కులం అనే విషయాల గురించి ఆలోచించరని వీడియోలో అన్నాను. దీన్ని తప్పుగా అనుకోకండి. పరువు హత్యకి మద్దతు తెలుపుతున్నవారిని చూసి నేను ఉద్వేగానికి లోనయ్యాను. మనుషులం అయివుండి సాటి మనుషులను చంపలేం.

అది ఓ యువతీయువకుల ప్రేమ విషయం కావొచ్చు.. లేదా తల్లితండ్రుల ప్రేమ కావొచ్చు.. తెలిసి తెలియని వయసులో ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే.. వారిని అర్ధం చేసుకోవాలే తప్ప హింసని ప్రోత్సహించకూడదు. ఇదే అందరికీ నా విన్నపం. నేనేం చెప్పినా పాజిటివ్ గా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువ ఆలోచించి ఏదేదో ఊహించుకోకండి.

ఇలా చేస్తూ మిమ్మల్ని మీరు ఇడియట్స్ గా మార్చుకుంటూ నన్ను ఇడియట్ గా మార్చొద్దు. మానవత్వం స్థానంలో కులం, మతం, జాతి అనేవి ఉండకూడదు. నన్ను, నా కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషిస్తున్న వారికి ఒక రిక్వెస్ట్.. నన్ను గౌరవించకపోయినా పర్లేదు.. కనీసం మహిళలను గౌరవించండి. మీకు కూడా ఓ అమ్మ, అక్క, భార్య, కూతురు ఉన్నారని గుర్తుంచుకోండి'' అంటూ రాసుకొచ్చారు.

Scroll to load tweet…

ఇవి కూడా చదవండి.. 

ప్రణయ్ హత్యపై మంచు మనోజ్ లెటర్!

వాళ్లు మారకపోతే 'జి' లో కొట్టి జైలుకి పోదాం.. మంచు మనోజ్ వివాదాస్పద వ్యాఖ్యలు!

మారుతిరావుని సపోర్ట్ చేస్తోన్న కుక్కలందరినీ చెప్పుతో కొట్టాలి.. మంచు మనోజ్ ఫైర్!