Asianet News TeluguAsianet News Telugu

మారుతిరావుని సపోర్ట్ చేస్తోన్న కుక్కలందరినీ చెప్పుతో కొట్టాలి.. మంచు మనోజ్ ఫైర్!

మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్యపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ అమృత తండ్రి మారుతీరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటుడు మంచు మనోజ్ ఇప్పటికే ఈ విషయంపై ట్విట్టర్ లో కొన్ని పోస్ట్ లు పెట్టారు. 

Manchu Manoj fires on maruthirao supporters
Author
Hyderabad, First Published Sep 24, 2018, 1:09 PM IST

మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్యపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ అమృత తండ్రి మారుతీరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటుడు మంచు మనోజ్ ఇప్పటికే ఈ విషయంపై ట్విట్టర్ లో కొన్ని పోస్ట్ లు పెట్టారు. తాజాగా ఆయన అమృత తండ్రి మారుతిరావుని సపోర్ట్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడాడు. 

''ఇంతటి దారుణమైన సంఘటన గురించి నేను మాట్లాడతానని ఎప్పుడూ ఊహించలేదు.. కులం అనే గోడలను కలం చెరపలేనప్పుడు అందరూ సమానం, అంతా సమానం, మనుషులంతా ఒక్కటేనని నిరూపించలేని విద్యావ్యవస్థ మొత్తం సిగ్గుపడాలి. అయ్యో పాపం అనాల్సిన టైమ్ లో తనను చంపడానికి కారణాలు ఏంటి అని వెతుక్కుంటున్నారు. కొందరేమో పరువు కోసం చంపారని, కొందరేమో స్టేటస్ కోసం చంపారని కొత్త కొత్త అబద్ధాలు సృష్టించుకొని బతుకుతున్నారు.

పదవ తరగతి నుండి ప్రేమించుకున్న వారికి ఏం తెలుస్తుందండి..? కులం గురించి మతం గురించి..?  ఆ వయసులో వారి మధ్య స్వచ్ఛమైన ప్రేమ తప్ప మీరేదీ ఉండదు. ఈ మధ్య ఫేస్ బుక్, ట్విట్టర్లో చూస్తున్నాను. అమృత తండ్రి తండ్రి చేసింది కరెక్ట్ అంటూ ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. అసలు మీకు మనసు ఎలా వస్తుంది అలా మాట్లాడడానికి..? అలా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న కుక్కలందరినీ చెప్పుతో కొట్టాలి. ముందు పోలీసులు, గవర్నమెంట్ ఇలాంటి నరహంతకులను సపోర్ట్ చేస్తున్న వారి పేర్లను నోట్ చేసి పెట్టుకోవాలి.

ఎందుకంటే మనం బతికే సమాజంలో మళ్లీ వారే ఇలాంటి దారుణాలు సృష్టిస్తారు. మీడియాని, ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ చట్టాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలి. దుబాయ్, అరబ్ కంట్రీస్ లో తప్పు చేసిన వారిని నడిరోడ్డు మీద ఉరి తీస్తారు. అలాంటి శిక్షలు వేస్తే తప్ప ఇలాంటి వారు భయపడరు. ఇలాంటివి జరుగుతున్నందుకు ప్రణయ్ కుటుంబానికి నా క్షమాపణలు. ఈ సమాజం కొందరు కుక్కల వల్ల ఇలా తయారైంది. మళ్లీ అందరం కలిసి మెలసి ఉందాం. ఇలాంటివి జరుగకుండా మన పిల్లలకు మంచి భవిష్యత్, మంచి ప్రపంచాన్ని ఇద్దామంటూ'' ఎమోషనల్ అయ్యారు. 

ఇవి కూడా చదవండి.. 

ప్రణయ్ హత్యపై మంచు మనోజ్ లెటర్!

వాళ్లు మారకపోతే 'జి' లో కొట్టి జైలుకి పోదాం.. మంచు మనోజ్ వివాదాస్పద వ్యాఖ్యలు!

Follow Us:
Download App:
  • android
  • ios