మంచు మనోజ్‌ తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నాడు. హీరో నుంచి విలన్‌గా టర్న్ తీసుకున్నాడు. `మిరాయ్‌`లో ఆయన పాత్ర గ్లింప్స్ అదిరిపోయేలా ఉంది.  

మంచు మనోజ్‌ నటుడిగా రీఎంట్రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఆయన వెండితెరపై మెరవబోతున్నారు. ఆ మధ్య `వాట్‌ ది ఫిష్‌` పేరుతో హీరోగా సినిమాని ప్రకటించారు. కానీ అది ఇంకా పట్టాలెక్కలేదు. ఆ మూవీపై సస్పెన్స్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విలన్‌గా మారాడు. `హనుమాన్‌` ఫేమ్‌ తేజ సజ్జా హీరోగా కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో `మిరాయ్‌` పేరుతో సినిమా రూపొందుతుంది. దీన్ని భారీ యాక్షన్‌ మూవీగా తెరకెక్కిస్తున్నారు. 

ఈ చిత్రంతో మంచు మనోజ్‌ రీఎంట్రీ ఇస్తున్నారు. ఆయన ఇందులో విలన్ గా నటిస్తుండటం విశేషం. ఆయన పాత్రని పరిచయం చేసింది యూనిట్‌. ది బ్లాక్‌ స్వార్డ్ గా మంచు మనోజ్‌ కనిపించనున్నారట. ఈ మేరకు మనోజ్‌ పాత్ర గ్లింప్స్ ని విడుదల చేశారు. ఇందులో ఆయన సరికొత్త లుక్‌లో చాలా పవర్‌ ఫుల్‌గా కనిపిస్తున్నారు. యాక్షన్‌తో అదరగొడుతున్నారు. బ్లాక్‌ స్వార్డ్ అనేది మోస్ట్ డేంజర్‌ ఫోర్స్ గా వర్ణించారు. దానికి తగ్గట్టుగానే మంచు మనోజ్‌ చేస్తే కత్తి యుద్ధం మతిపోయేలా ఉంది. గ్లింప్స్ హాలీవుడ్‌ రేంజ్‌లో చాలా స్టయిలీష్‌ యాక్షన్‌ని ఆవిష్కరించింది. మ్యూజిక్‌, బీజీఎం అదిరిపోయాయి. ఇది సినిమాపై మరింతగా అంచనాలను పెంచిందని చెప్పొచ్చు. 

మంచు మనోజ్‌ బర్త్ డే సందర్భంగా సోమవారం ఈ మూవీకి సంబంధి మనోజ్‌ పాత్ర గ్లింప్స్ ని విడుదల చేయడంతో అభిమానులను ఆకట్టుకుంటుంది. వాళ్లు ఆయనకు వెల్‌ కమ్‌ బ్యాక్‌ అంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇందులో మనోజ్‌ సైతం తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాడని చెప్పొచ్చు. దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని ఇటీవల `ఈగల్‌` మూవీ చేశాడు. సినిమా ఆడలేదు. కానీ టెక్నీకల్‌గా మంచి ప్రశంసలు అందుకుంది. దాన్ని మించి ఇప్పుడు `మిరాయ్‌`(సూపర్‌ యోధ) చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యంగ్‌ హీరోలతో ఈ రేంజ్‌ మూవీ చేస్తుండటం విశేషం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దీన్ని నిర్మిస్తుంది. 

YouTube video player