Asianet News TeluguAsianet News Telugu

విలన్‌గా మంచు మనోజ్‌.. నేటి నుంచే షూటింగ్‌.. ఏ సినిమాలో అంటే?

మంచు మనోజ్‌ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. పిక్‌ షేర్‌ చేసుకున్నారు. 
 

manchu manoj back to set for shooting which movie? arj
Author
First Published Apr 22, 2024, 2:24 PM IST

మంచు మనోజ్‌ సినిమాలు చేసి చాలా కాలం అవుతుంది. దాదాపు ఏడేళ్లుగా ఆయన మూవీస్‌కి దూరంగా ఉంటున్నారు. వరుస పరాజయాలు, వ్యక్తిగత లైఫ్‌ డిస్టర్బ్ కావడంతో మంచు మనోజ్‌ సినిమాలు మానేశాడు. గతేడాది ఆయన పెళ్లి చేసుకున్నారు. భూమా మౌనిక రెడ్డితో ఆయన వివాహం జరిగింది. ఈ ఇద్దరికీ రెండో వివాహం అనే విషయం తెలిసిందే. 

ఇటీవలే భూమా మౌనికా రెడ్డి మరోసారి తల్లి అయ్యింది. మొదటి భార్తతో ఆమెకి కుమారుడు ఉన్నాడు. మంచు మనోజ్‌ని వివాహం చేసుకున్నాక మరోసారి ఆమె తల్లి అయ్యింది. ఇటీవల కూతురికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభించారు మనోజ్‌. ఆయన ఆ మధ్య `ఉస్తాద్‌` అనే షో చేశాడు. ఈ సెలబ్రిటీ టాక్‌ షో పెద్దగా సక్సెస్‌ కాలేదు. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.  

ఇక ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తున్నారు. ఓరకంగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని మంచు మనోజ్‌ పేర్కొన్నారు. హార్ట్ హార్ట్ హస్టిల్‌.. మళ్లీ సెట్‌లోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని, నేను ప్రేమించేది ఇప్పుడు చేస్తున్నా అని తెలిపారు మంచు మనోజ్‌. షూటింగ్‌ సెట్‌లోని పిక్‌ని పంచుకున్నాడు. అయితే ఇది ఏ సినిమా షూటింగ్‌ అనేది చెప్పలేదు. అయితే `మిరాయ్‌` షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. మంచు మనోజ్‌ ఇందులో విలన్‌ పాత్రలో నటించబోతున్నారనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన పోస్ట్ ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం ఆయన మిరాయ్‌ షూటింగ్‌లోనే జాయిన్‌ అయినట్టు తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

తేజ సజ్జా హీరోగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో `మిరాయ్‌` మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ టీజర్‌ని విడుదల చేయగా, ఆద్యంతం కట్టిపడేస్తుంది. గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. ఈ మూవీలో తేజని ఢీ కొట్టే విలన్‌ పాత్రలో మనోజ్‌ కనిపిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే ఆ మధ్య `వాట్‌ ది ఫిష్‌` అనే చిత్రాన్ని ప్రకటించారు మనోజ్‌. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అప్‌ డేట్‌ రాలేదు. ఈ మూవీ కూడా ఆగిపోయిందనే వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. 

మంచు మనోజ్‌ చివరగా 2017లో `ఒక్కడు మిగిలాడు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. అది పరాజయం చెందింది. ఆ తర్వాత `ఇది నా లవ్‌ స్టోరీ`, `ఆపరేషన్‌ 2019`సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేశారు. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇన్నాళ్లకి మళ్లీ షూటింగ్‌ సెట్‌లోకి అడుగపెట్టడం విశేషం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios