జిమ్ ను ప్రారంభించిన మంచు మనోజ్ - మౌనికా దంపతులు.. ప్రత్యేకతలు ఏంటంటే?
మంచు మనోజ్ - మౌనికా దంపతులు ఇటీవల ఆయా ఈవెంట్లలో సందడి చేస్తున్నారు. తాజాగా అత్యాధునికతతో ఏర్పాటు చేసిన జిమ్ ను ప్రారంభించారు. జంటగా ఫొటోలకు ఫోజులిచ్చారు.
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) - మౌనికా పెళ్లి ఈ ఏడాది మార్చిలో జరిగిన విషయం తెలిసిందే. వివాహ బంధంలో అడుగుపెట్టిన తర్వాత ఈ జంట తరుచూగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఆయా షోల్లో సందడి చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా తెలుగు హీరోగా మంచు మనోజ్ మాత్రమే తన భార్యతో అంబానీ ఈవెంట్ కు హాజరవడం విశేషం. ఆ తర్వాత తాజాగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన బీఫిట్ జిమ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిమ్ ను మౌనికారెడ్డితో కలిసి లాంచ్ చేసి నిర్వాహకులకు ఆల్ దిబెస్ట్ చెప్పారు.
ఐటీ ఉద్యోగుల కోసమే ప్రత్యేకంగా ఈ జిమ్ ను బృహస్పతి టెక్నాలజీస్ ఎండీ రాజశేఖర్ పాపోలు ఏర్పాటు చేయడం విశేషం. నగరంలోని ఐకియా ఎదురుగా అరబిందో టవర్స్‌లో జిమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిమ్ లోని ప్రత్యేకతలను చెప్పుకొచ్చారు. అనంతరం మనోజ్, మౌనికా ఫొటోలకు ఫోజులిచ్చారు. జిమ్ నిర్వాహకులు, సిబ్బందితో కలిసి సందడి చేశారు. మనోజ్ ప్రస్తుతం ‘వాట్ ది ఫిష్’, ‘ఆహం బ్రహ్మాస్మి’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే రియాలిటీ గేమ్ షో Ram Addidham తోనూ బుల్లితెరపైకి రాబోతున్నారు.
ఇక జిమ్ విషయానికొస్తే.. రాజశేఖర్ మాట్లాడుతూ.. ఈ ఒక్క టవర్స్‌లోనే దాదాపు 20 వేల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారితో పాటు చుట్టుపక్కల ఉన్న అనేక కంపెనీలలోనూ చాలామంది పనిచేస్తుంటారు. వీరందరికీ అందుబాటులో ఉండేలా 5వేల చదరపు అడుగుల సువిశాల స్థలంలో అత్యాధునిక పరికరాలతో మా జిమ్ ఏర్పాటుచేశాం. గతంలో మొదటిది ఎస్ఆర్ నగర్‌లో ఏర్పాటుచేయగా, ఇది రెండోది. ఇందులో ఎలైట్ సిరీస్‌కు చెందిన అత్యాధునిక పరికరాలన్నీ ఉంటాయి. సెంట్రలైజ్డ్ ఏసీ, మ్యూజిక్ సిస్టం రోజంతా ఉంటాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏ సమయంలోనైనా రావచ్చు.
రెండు షిఫ్టులలో ఆరుగురి చొప్పున ట్రైనర్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఒక న్యూట్రిషనిస్టు కూడా ఇక్కడే ఉండి, అవసరమైన ఆహార సూచనలు ఇస్తారు. ఐటీ ఉద్యోగులకు ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది, ఒకేచోట కూర్చుని ఎక్కువసేపు పనిచేయాల్సి ఉంటుంది. అలాంటివాళ్లు మధ్యలో వచ్చి ఒక గంట సేపు జిమ్ చేసుకున్నా బాగుంటుంది. ఇక్కడ ఏరోబిక్స్, జుంబా కూడా ఉంటాయి. స్టీమ్ బాత్ సదుపాయం కూడా ఉండటంతో.. జిమ్ చేసుకున్న తర్వాత స్టీమ్ బాత్ తీసుకుని, దుస్తులు మార్చుకుని చాలా రిలాక్స్ అయ్యి మళ్లీ ఆఫీసుకు, లేదా ఇంటికి వెళ్లొచ్చు. కొన్ని ఐటీ కార్యాలయాల్లో కూడా జిమ్‌లు ఏర్పాటుచేస్తున్నా, అక్కడి కంటే ఇక్కడ ప్రొఫెషనల్ ట్రైనర్ల శిక్షణలో.. అత్యాధునిక పరికరాలతో జిమ్ చేయడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. దానికితోడు ఒత్తిడికూడా తగ్గుతుంది. దీన్ని ఐటీ ఉద్యోగులంతా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం” అని చెప్పారు.